BJP: నిర్మలమ్మ ఆస్తులెంత!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు బాధ్యతలు నిర్వర్తించటం అంత ఆషామాషి కాదు. ప్రతి పద్దు ఆర్థిక మంత్రి చేతుల మీదుగానే వెళ్తుంది. అలాంటి ఆర్థిక మంత్రికి అప్పులు ఉన్నాయంటే కొందరు నమ్మక పోవచ్చు. కానీ, అదే నిజం.

BJP: నిర్మలమ్మ ఆస్తులెంత!
New Update

తన వద్ద డబ్బులు లేకపోవడంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇటివెల నిర్మలమ్మ వెల్లడించారు. దీంతో ఆర్థిక మంత్రి ఆస్తులు గురించి గూగుల్ లో వెతకడం ప్రారంభించారు ప్రజలు. దేశ ఆర్థిక మంత్రి అయి ఉండి నిజంగా ఆమె వద్ద డబ్బు లేదా? అనే విషయంపై చర్చించుకుంటున్నారు. మరి నిర్మలమ్మ ఆస్తి, ఆప్పులు ఎంతో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

2022లో రాజ్యసభ సభ్యురాలిగా తన ఆస్తులు, అప్పులకు సంబంధించి వివరాలను నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆమె ఇచ్చిన వివారల మేరకు మొత్తం ఆస్తుల విలువ రూ.2.53 కోట్లుగా ఉంది. ఇందులో రూ.1.87 కోట్లు స్థిరాస్తులు ఉండగా.. రూ. 65.55 లక్షలు విలువైన చరాస్తులు ఉన్నాయి. అంతే కాదు రూ.26.91 లక్షలు అప్పులు ఉన్నాయి. అయితే, లోన్ రీపేమెంట్, ఇన్వెస్ట్‌మెంట్లను బట్టి 2024 నాటికి ఈ లెక్కల్లో కాస్త వ్యత్యాసం ఉంటుంది.

నిర్మలా సీతారామన్.. తన భర్త డాక్టర్ పరకాల ప్రభాకర్‌తో కలిసి హైదరాబాద్ సమీపంలోని మంచిరేవులలో ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్ కలిగి ఉన్నారు. 2016లో దీని విలువ రూ.99.36 లక్షలుగా పేర్కొనగా.. 2022లో ఈ ఇంటి విలువను రూ.1.7 కోట్లుగా వెల్లడించారు. అలాగే కుంట్లూరు ప్రాంతంలో రూ.17.08 లక్షలు విలువ చేసే వ్యవసాయేతర భూమి కలిగి ఉన్నారు సీతారామన్. 2016లో ఈ భూమి విలువ రూ.16.02 లక్షలుగా ఉంది. 2016, 2022 డిక్లరేషన్ చూస్తే ఆమెకు సొంత కారు లేదు. కేవలం రూ.28,200తో కొనుగోలు చేసిన బజాజ్ చేతక్ స్కూటర్ ఉంది. 2016లో సీతారమన్ వద్ద 315 గ్రాముల బంగారం ఉంది. అప్పుడు దాని విలువ రూ.7.87 లక్షలు. అయితే, బంగారం విలువ పెరగడంతో 2022 నాటికి ఆ విలువ రూ.15.49 లక్షలుగా ఉంటుంది. ప్రస్తుత ధర బట్టి చూస్తే 22క్యారెట్ల రేటుతో ఆ విలువ రూ.19.4 లక్షలుగా ఉంటుంది. అదే 24 క్యారెట్లుగా అనుకుంటే రూ.21.18 లక్షలుగా ఉంటుంది.

2016లో నిర్మలా సీతారామన్ 2 కిలోల వెండిని కలిగి ఉన్నారు. 2022 నాటికి 5.28 కిలోల వెండి కలిగి ఉన్నారు. 2016తో పోలిస్తే వెండిపై అదనంగా రూ.2.6 లక్షలు పెట్టుబడి పెట్టారు. 2022 డిక్లరేషన్ సమయానికి ఆ వెండి విలువ రూ.3.98 లక్షలుగా ఉంటుంది. మరోవైపు.. బ్యాంక్ డిపాజిట్ల విషయానికి వస్తే 2016లో 6.77 లక్షలు ఉండగా.. 2022 నాటికి అవి రూ.35.22 లక్షలకు పెరిగాయి. 2016లో ఆమెకు పీపీఎఫ్ అకౌంట్ లేదు. కానీ, 2022కు వచ్చే సరికి పీపీఎఫ్ లో రూ.1.6 లక్షలు పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో రూ.5.08 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. 2022లో తన వద్ద కేవలం రూ.7,350 నగదు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. రూ.2.7 లక్షలు రుణంగా ఇచ్చినట్లు వెల్లడించారు. వీటితో పాటు రూ.5.08 లక్షలు ఇతర రాబడులు ఉన్నాయని తెలిపారు. నిర్మలా సీతారామన్ దంపతులు హోమ్ లోన్ చెల్లిస్తున్నారు. 2022 నాటికి ఇంకా రూ.5.44 లక్షల హోమ్ లోన్ చెల్లించాల్సి ఉంది. అలాగే రూ.2.53 లక్షల ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఉంది. రూ.18.93 లక్షల మార్ట్ గేజ్ లోన్ తీసుకున్నారు. ఈ రుణాలు ఇద్దరి పేర్లతో ఉన్నాయి.

#nirmala-sitharaman #central-finance-minister
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe