Lok Sabha Elections:1954 ఎన్నికల్లో 10.5 కోట్ల ఖర్చు,72 ఏళ్ల తర్వాత ఆ లెక్క ఎంత?

 దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఈ ఎన్నికల్లో రూ. 10.5 కోట్లు ఖర్చు చేశారు . ఆ తర్వాత గణనీయంగా పెరిగిన లెక్కల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Lok Sabha Elections:1954 ఎన్నికల్లో 10.5 కోట్ల ఖర్చు,72 ఏళ్ల తర్వాత ఆ లెక్క ఎంత?

లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. 7 దశలుగా  లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది. తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 19నప్రారంభమై , చివరగా మే 26న ముగియనున్నాయి. జూన్ 4న ఫలితాలు  విడుదల కానున్నాయి. 

తొలి లోక్ సభ ఎన్నికలకు ఎంత ఖర్చు చేశారు..
దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. అప్పుడు  ఎన్నికల్లో రూ.10.5 కోట్లు ఖర్చు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ వ్యయం రూ.3870.3 కోట్లకు పెరిగింది. అంటే 63 ఏళ్లలో ఎన్నికల ఖర్చు 36,857 కోట్లకు  చేరింది. అదే సమయంలో ఓటర్ల సంఖ్య కూడా 17.32 కోట్ల నుండి 91.2 కోట్లకు వృద్ధి చెందింది..  2009 - 2014 మధ్య, ఎన్నికల ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో రూ.1114.4 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈ సార్వత్రిక ఎన్నికల్లో 98 కోట్ల మంది ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకుంటారని అంచనా వేస్తుంది.

ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 మధ్యంతర బడ్జెట్‌లో ఎన్నికల ఖర్చుల కోసం రూ.2,442.85 కోట్లు కేటాయించారు. ఇందులో లోక్ సభ ఎన్నికలకు రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నారు. బడ్జెట్‌లో ఈవీఎంలకు  రూ.34.84 కోట్లను కేటాయించారు. 2023-24లో ఓటరు గుర్తింపు కార్డు కోసం సవరించిన బడ్జెట్ రూ.79.66 కోట్లు. ఇప్పుడు అది రూ.404.81 కోట్లకు పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.321.89 కోట్లు కూడా మంజూరు చేసింది. ఇందులో ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు రూ.306.06 కోట్లు. ప్రజా పనులకు కేటాయించిన మొత్తం రూ.2.01 కోట్లు.శాంతి భద్రత దృష్ట్యా చేసిన  రూ.13.82 కోట్లు వినియోగించనున్నారు.

ఎన్నికల ఖర్చు పెరగడానికి కారణం ఏమిటి?

లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఎన్నికల్లో సీట్లు, పోలింగ్ బూత్‌లు, శాంతి భద్రతల అవసరం ఎంతో ఉంది. అలాగే ఓటర్లు సంఖ్య పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుంది. 1951-52లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 401 స్థానాల్లో 53 పార్టీల నుంచి 1,874 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2019లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 673 పార్టీల నుంచి 8,054 మంది అభ్యర్థులు 543 స్థానాల్లో పోటీ చేయగా, మొత్తం 10.37 లక్షల పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరిగింది.

.  ఓటర్లకు అవగాహన కల్పించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలి. వీటన్నంటికి అయ్యే ఖర్చు అధికార ప్రభుత్వం భుజాల పై పడుతుంది. దేశంలో తొలి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఎన్నికల వ్యయం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. వాటి లెక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisment
తాజా కథనాలు