ఆధార్ సేవల కోసం ఆధార్ కేంద్రాలు, ఈఏ, ఏఎస్‌కేలు ఎంత ఫీజు వసూలు చేస్తాయో తెలుసుకోవడం మంచిది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, తప్పనిసరిగా చేయాల్సిన బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఎలాంటి ఫీ లేదు. డెమొగ్రాఫిక్ అప్డేట్ కోసం రూ.50, ఈ-ఆధార్ డౌన్‌లోడ్ అండ్ కలర్ ప్రింట్ కోసం రూ.30 చెల్లించాలి. అయితే, యూఐడీఏఐ మెమోరండమ్ ప్రకారం ఆధార్ వివరాల అప్డేట్‌పై పరిమితులు వివరాలు ఇలా ఉన్నాయి.
- యూఐడీఏఐ కార్యాలయం మెమోరండమ్ ప్రకారం ఆధార్ కార్డు హోల్డర్ తన పేరును కేవలం రెండు సార్లు మాత్రమే అప్‌డేట్ చేసుకోవచ్చు.
- మరోవైపు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్‌ను కేవలం ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది. అయితే, ఇందులోనూ కొన్ని షరతులు ఉన్నాయి. ఎన్‌రోల్‌మెంట్ సమయంలో ఇచ్చిన తేదీకి కేవలం మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. డేట్ మార్చుకోవాలనుకునే వారు తప్పనిసిరాగా దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
- ఆధార్ కార్డులో జెండర్ మార్చుకోవాలనుకుంటున్న వారు యూఐడీఏఐ మెమోరండం ప్రకాం కేవలం ఒకసారి అప్‌డేట్ చేసుకోవచ్చు. మరోసారి చేసుకునే వీలు లేదు.
- ఒకవేళ పరిమితికి మించి పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చేస్తారు. అలాంటి వారు సమీపంలోని ప్రాంతీయ కార్యాలయనికి వెళ్లి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇమెయిల్, పోస్ట్ ద్వారా ప్రాంతీయ కార్యాలయాలకు రిక్వెస్ట్ చేయాలి. యూఆర్ఎన్ స్లిప్, ఆధార్ వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలను జత చేస్తూ ఎందుకు ఆమోదించాలో పూర్తిగా వివరించాల్సి ఉంటుంది. help@uidai.gov.in. హైల్ప్‌లైన్‌కు ఇమెయిల్ చేయాలి. అధికారులు కోరితే తప్ప నేరుగా ఆఫీసులకు వెళఅలాల్సిన అవసరం లేదు.