బరువు తగ్గాలనుకునేవాళ్లు ముందుగా హై క్యాలరీ ఫుడ్స్ మానేసి పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. డైటరీ ఫైబర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. మరీ పస్తులుండకుండా కనీసం రోజుకి వెయ్యి క్యాలరీలు అయినా తీసుకోవాలి. ఇలా కొంత కాలం చేసి ఆపైన క్రమంగా వ్యాయామం మొదలు పెట్టాలి. వ్యాయామం చేసేటప్పుడు ముందు వాకింగ్‌తో మొదలుపెట్టి ఆ తర్వాత ట్రెడ్‌మిల్, జాగింగ్, జిమ్ వంటివి ఎంచుకోవచ్చు.
వ్యాయామం చేసే ముందు, తర్వాత పండ్ల రసాలు తీసుకుంటే శరీరం అలసిపోకుండా ఉంటుంది. నెలకు రెండు కిలోలకు మించి బరువు తగ్గాలని చూస్తే రక్త ప్రసరణ, గుండెపై అదనపు భారం పడే ప్రమాదముంటుంది. కాబట్టి బరువు తగ్గే విషయంలో సహనం ఉండాలి. ముఖ్యంగా వయసుపైబడినవాళ్లు వ్యాయామాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇకపోతే డయాబెటిస్, బీపీ, కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు వ్యాయామాలు చేస్తే మంచిది. శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా బరువు తగ్గుతారు. కాబట్టి దానికనుగుణంగా డైట్ ప్లాన్ చేసుకోవాలి.