Health : ఇలాంటి వారికి దూరంగా ఉండండి.. లేకపోతే మానసిక సమస్యలు తప్పవు!

చికాకు పుట్టించే విషయాలను, చికాకు పెట్టే మనుషులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీర్ఘకాలిక చికాకు మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. ఆందోళన లేదా నిరాశ లాంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.

New Update
Mental Health Tips: మీరు ఎప్పుడూ ఏదో  టెన్షన్ తో ఉంటారా? అయితే.. ఈ 8 టిప్స్ మీ కోసమే!

Mental Problems : ప్రాబ్లెమ్‌ సాల్వ్ చేసుకునే కంటే కొన్నిసార్లు ఆ ప్రాబ్లెమ్‌ను పక్కన పెట్టడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాథ్స్ ప్రాబ్లెమ్స్‌(Maths Problems) అయితే సాల్వ్ చేయగలం కానీ.. అవతలి వాళ్లు పనిగట్టుకోని మనపై ప్రయోగించే మెంటల్‌ ప్రాబ్లెమ్స్‌(Mental Problems) ని సాల్వ్ చేస్తూ కూర్చోలేం కదా. మన టైమే పాడవుతుంది. ఎందుకంటే మనుషులు భిన్న రకాలు.. ఏ ఒక్కరితో మరొకరికి మ్యాచ్ అవ్వదు.. అలాగని అందరితో సర్ధుకోని పోవాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది. చికాకు పుడుతుంది. ఈ ఇరిటేషన్‌(Irritation) కూడా ఒక సమస్యే.. దీని వల్ల అనేక మానసిక సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకోండి.

Mental Problems ప్రతీకాత్మక చిత్రం

ఒత్తిడి నుంచి ఏకాగ్రత వరుకు:
నిరంతర చికాకుతో వ్యవహరించడం ఒత్తిడి స్థాయి(Pressure) లను పెంచుతుంది. ఇది మొత్తం ఆందోళనకు దారి తీస్తుంది. నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది అలసట, మానసిక రుగ్మతలకు కారణం అవుతుంది. చికాకుగా ఉంటే ఫొకస్‌ ఉండదు. చికాకు మానసిక కల్లోలం, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. అటు చికాకుతో ఉంటే కోపం వస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి.

Pressure ప్రతీకాత్మక చిత్రం

మానసిక సమస్యలు:
దీర్ఘకాలిక చికాకు మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఆందోళన లేదా నిరాశ లాంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలాంటి చికాకును వదిలించుకోవడానికి మనం చేయాల్సిందల్లా ఒక్కటే. చికాకు పెట్టే విషయాలను, చికాకు పెట్టే మనుషులకు దూరంగా ఉండడమే బెస్ట్.

Also Read : రంజాన్‌ మాసంలో ఖర్జూరం పండుకు ఎందుకు అంత ప్రాముఖ్యతో తెలుసా!

Advertisment
తాజా కథనాలు