Rice export ban: బియ్యం కోసం తన్నుకుంటున్నారు.. అమెరికాలో ఈ పరిస్థితికి కారణాలేంటి? బియ్యం కోసం తన్నుకుంటున్న పరిస్థితి అమెరికాలో నెలకొంది. రైస్ ఎగుమతులను ఇండియా నిలిపివేయడంతో అమెరికాలో రైస్ కొరత ఏర్పడింది. 10కేజీల బియ్యం కోసం రెండు గంటలు వెయిట్ చేయాల్సి వస్తోంది. By Trinath 22 Jul 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి బియ్యం(rice) కోసం తన్నుకుంటున్నారు..తోసుకుంటున్నారు..వాదించికుంటున్నారు..ఎగపడుతున్నారు.. ఇదంతా ఏ వరద ప్రాంతంలో సహాయిక చర్యల్లోని దృశ్యాలు కావు.. ప్రపంచానికి అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా(america)లో ప్రస్తుత పరిస్థితులివి. అక్కడ నివాసముంటున్న భారతీయుల(indians) ఇక్కట్లు ఇవి. సోషల్‌మీడియా(social media)లో వైరల్ అవుతున్న వీడియోలు అక్కడి పరిస్థితులను క్లియర్‌కట్‌గా చూపిస్తున్నాయి. బియ్యం కోసం షాప్‌లు వద్ద ఇండియన్స్ క్యూ కడుతున్నారు. రెండు గంటలు నిలపడితే కానీ 10కేజీల రైస్ బ్యాగ్ ఇవ్వని దుస్థితి దాపరించింది. గంటల(hours) పడిగాపుల తర్వాత స్టోర్ యాజమాన్యం కుటుంబానికి కేవలం ఒక్కటంటే ఒక్క 10కేజీల రైస్ బ్యాగ్‌నే ఇస్తున్నారట! బాస్మతి బియ్యం కాకుండా మిగిలిన అన్ని రకాల రైస్ ఎగుమతులను కేంద్రం నిలిపివేయడంతో పరిస్థితి నెలకొంది. Big Fight For Sona Masoori Rice in USA. #riceexports #riceexportban pic.twitter.com/atMAJqs1XS — greatandhra (@greatandhranews) July 21, 2023 రైస్ ఎగుమతులను ఇండియా ఎందుకు నిలిపివేసింది? --> బియ్యం ధరలు పెరగడం --> మన మార్కెట్‌లో తగినంత తెల్ల బియ్యం లేకపోవడం --> ధరలను కంట్రోల్ చేయడం కోసం --> దేశీయ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం కోసం --> రుతుపవనాలు ఆలస్యం కావడంతో దెబ్బతిన్న పంటలు --> పంట నష్టాన్ని నివారించేందుకు రైస్ ఎగుమతులపై బ్యాన్ If the clips being shared by NRIs from the West are true, fight for hoarding of rice kicked of after rumours of Indian ban on export of #IndianRice. Reminds days of demonetisation in India. @mrsubramani pic.twitter.com/wlpgjKuGxD — Ameer Shahul (@ameershahul) July 22, 2023 ప్రపంచానికి ఇండియా రైస్ ఎందుకు కీలకం? --> గ్లోబల్ రైస్(global rice) ఎగుమతుల్లో మన దేశం వాటా 40శాతం కంటే ఎక్కువే. --> 2022లో 55.4 మిలియన్ మెట్రిక్ టన్నుల రైస్‌ని ఎగుమతి చేసిన ఇండియా. --> 140కి పైగా దేశాలకు మన దగ్గర నుంచే బాస్మతీయేతర బియ్యం ఎగుమతి. --> బెనిన్, బంగ్లాదేశ్, అంగోలా, కామెరూన్, జిబౌటి, గిని, ఐవరీ కోస్ట్, కెన్యా, నేపాల్..ఈ దేశాలు బియ్యాన్ని ప్రధాన ఆహారంగా కలిగి ఉన్నాయి. ఇవి మన దగ్గర బాస్మతీయేతర బియ్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తాయి. --> ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా ప్రధానంగా భారత్ నుంచి ప్రీమియం బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేస్తాయి. --> ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ప్రజలకు బియ్యం ప్రధాన ఆహారం. --> బియ్యం సరఫరాలో 90శాతం ఆసియానే వినియోగిస్తుంది. అమెరికాలో ఎందుకీ తన్నులాట?: నిజానికి ఏ దేశం వెళ్లినా మనవాళ్లు ఆహార అలవాట్ల విషయంలో రాజీపడరు. అమెరికా వెళ్లినా..ఆస్ట్రేలియా వెళ్లినా స్వదేశి ఫుడ్‌నే తింటారు. రైస్ ఎగుమతుల బ్యాన్ తర్వాత ప్రపంచదేశాల్లోని భారతీయులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వచ్చాయి.. ముందుముందు అవి మరింత పెరగనున్నాయి. మనవాళ్లు ఎక్కువగా ఉండే అమెరికాలో ఇప్పటికే ఈ పరిస్థితి కనిపిస్తుంది. స్టోర్‌ల ముందు జనాలు బారులు తీరి ఉండడంతో పాటు పెరిగిన డిమాండ్‌కి తగ్గట్టుగా ధరలు కూడా అమాంతం పెంచుతున్నారు. అయితే కొన్ని స్టోర్స్‌లో మాత్రం సాధారణ రేట్లకే అమ్ముతున్నారు. 10కేజీల బియ్యం బ్యాగ్ రూ.1,600కి సేల్ చేస్తున్నారు. డల్లాస్‌లో రైస్ కొరత ఎక్కువగా ఉండగా..మిగిలిన ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు అక్కడి ఇండియన్స్ చెబుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి