తెల్లజుట్టు నల్లగా మారాలంటే...ఇలా చేయండి..!!

నేటికాలంలో తెల్లజుట్టు సమస్య సర్వసాధారణంగా మారింది. చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య చాలామందిని వేధిస్తోంది. అయితే కొన్ని హోం రెమెడీస్ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

New Update
తెల్లజుట్టు నల్లగా మారాలంటే...ఇలా చేయండి..!!

నేటికాలంలో చిన్న వయస్సులోనే చాలామంది తెల్లజుట్టును సమస్యను ఎదుర్కొంటున్నారు. 20 నుంచి 25ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. తెలపై తెల్లజుట్టు రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. అయితే తెల్లజుట్టు రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా తెల్లజుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మన చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కూడా కారణం అయ్యే అవకాశం ఉంది.

publive-image

అయితే చాలామంది జుట్టు తెల్లగా మారగానే..మార్కెట్లో దొరికే రకరకాల డైలను ఉపయోగిస్తుంటారు. వాటిని ఉపయోగించడం వల్ల అందులో ఉండే రసాయనాలు జుట్టును మరింత బలహీనంగా మార్చేస్తాయి. అయితే మార్కెట్లో దొరికే రకరకాల రసాయనాలుఉన్న హెయిర్ డైలను వాడే బదులు ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులతో తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

1. కాఫీ, టీ లీఫ్ నీరు:
జుట్టుకు సహజంగా రంగు వేయడానికి మీరు టీ లీఫ్ నీటిని ఉపయోగించవచ్చు. దీంతోపాటు కాఫీతో జుట్టుకు రంగు వేసుకోవచ్చు. ఎలాగంటే రెండు చెంచాల కాపీ పొడిని తీసుకుని అందులో కొద్దిగా అలోవెరా జెల్ వేసి పైన టీ లీవ్స్ వాటర్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇది తెల్లజుట్టును నల్లగా మార్చడంతోపాటు మీ జుట్టును సిల్కీగా మారుస్తుంది.

2. మెహందీ ఆమ్లా పౌడర్ :
మెహందీ ఉసిరి పొడితో చక్కటి హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఐరన్ పాన్ తీసుకుని అందులో ఉసిరి, మెహందీ పొడి కలపాలి. అందులో కొంచెం పెరుగును తీసుకుని మజ్జిగలా చేసుకుని కలపాలి. ఒక గంటపాటు అలాగే నానాబెట్టాలి. తర్వాత దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి 1 గంట పాటు అలాగే ఉంచండి. మీ జుట్టును గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల మీ జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాదు జుట్టు ఊడిపోయే సమస్య కూడా తగ్గుతుంది.

3. జామున్ డై:
జామున్ డై చేయడానికి, జామూన్ నుంచి పొడిని తయారు చేయండి. ఇప్పుడు అందులో కొంచెం కొబ్బరినూనె వేసి జుట్టుకు పట్టించాలి. ఇలా కాసేపు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టును నల్లగా మారుస్తుంది.దీని వల్ల మీ జుట్టుకు ఎలాంటి హానిఉండదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు