Hyderabad: టేస్టీగా ఉన్నాయని ఉస్మానియా బిస్కెట్స్ కుమ్మేస్తున్నారా? అయితే, ఇది చూడాల్సిందే..

అలా సాయంకాలం సమయంలో ఓ కప్పు ఇరానీ చాయ్‌లో రెండు ఉస్మానియా బిస్కెట్స్ తింటుంటే.. ఆ మజానే వేరప్పా అని అంటుంటారు హైదరాబాదీలు. అయితే, ఇప్పటి దాకా మనం దాని క్రేజ్ గురించి చెప్పుకున్నాం.. కానీ, ఇప్పుడు అంత క్రేజ్ ఉన్న ఉస్మానియా బిస్కెట్ల తయారీలో తయారీదారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఓసారి చూద్దాం.

Hyderabad: టేస్టీగా ఉన్నాయని ఉస్మానియా బిస్కెట్స్ కుమ్మేస్తున్నారా? అయితే, ఇది చూడాల్సిందే..
New Update

Hyderabad News: హైదరాబాద్ అంటే చార్మినార్, ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కట్(Osmania Biscuit). ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్‌లో ఫేమస్ ఇవి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని ఏ సినీ సెలబ్రిటీ, పొలిటికల్ సెలబ్రిటీని అడిగినా టక్కున హైదరాబాద్ బిర్యానీ(Hyderabad Dum Biryani) అని చెబుతారు. ఇక ఇరానీ చాయ్‌కి, ఉస్మానియా బిస్కెట్స్‌కి ఉండే క్రేజే వేరు. అలా సాయంకాలం సమయంలో ఓ కప్పు ఇరానీ చాయ్‌లో రెండు ఉస్మానియా బిస్కెట్స్ తింటుంటే.. ఆ మజానే వేరప్పా అని అంటుంటారు హైదరాబాదీలు. అయితే, ఇప్పటి దాకా మనం దాని క్రేజ్ గురించి చెప్పుకున్నాం.. కానీ, ఇప్పుడు అంత క్రేజ్ ఉన్న ఉస్మానియా బిస్కెట్ల తయారీలో తయారీదారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఓసారి చూద్దాం. అది తెలిస్తే ఇక జీవితంలో ఉస్మానియా బిస్కెట్స్ తినాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ పరిధిలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఉస్మానియా బిస్కెట్ల తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. ఈ బిస్కెట్‌లలో ఈగలు కలిసి ఉన్నట్లు గుర్తించిన కస్టమర్లు.. అధికారులకు కంప్లైంట్ చేశారు. దాంతో అధికారులు రైడ్స్ నిర్వహించారు. బిస్కెట్ల తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. రూ. 36,000 విలువైన స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో గల ఓ దుకాణంలో వినయ్ వంగాల అనే వ్యక్తి ఉస్మానియా బిస్కెట్ల ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. అయితే, ఆ ప్యాకెట్‌ ఓపెన్ చేయగానే.. అందుతో కాలిపోయిన ఈగలు కనిపించాయి. షాపు యజమానికి తెలుపగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. వెంటనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఫిర్యాదుకు రియాక్ట్ అయిన జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. సదరు దుకాణంలో ఉస్మానియా బిస్కెట్ల శాంపిల్స్ తీసుకుని, స్టాక్ ను సీజ్ చేశారు.

Also Read: Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్.. ఇస్రో అరుదైన ఘనత

ఇదొక్క ఘటనే కాదు.. నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవలి కాలంలో కల్తీ అల్లం పేస్ట్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, పోలీసులు. ఇక గతంలో కల్తీ ఐస్‌క్రీమ్స్‌ని కూడా తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఇలాంటి ఘటనలు నగరంలో నిత్యం ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.

Also Read: PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 15వ విడత కిసాన్ నిధులు పడాలంటే ఈ పనులు చేయాల్సిందే..

#osmania-biscuit
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe