Hyderabad Real Estate: రాజధానిలో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..అయినా వెనకాడట్లే..!!

New Update
Hyderabad Real Estate: రాజధానిలో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..అయినా వెనకాడట్లే..!!

దేశంలోనే అత్యధికంగా ఇళ్ల ధరల్లో పెరుగుదల హైదరాబాద్ ఉంది. ఏడాది కాలంలోనే ధరల్లో 19శాతం పెరిగినట్లు క్రెడాయ్ కొలియర్స్ తాజాగా వెల్లడించిన హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్టులో పేర్కొంది. దేశంలో 8 పెద్ద నగరాల్లో ధరల పెరుగుదల సగటు 10శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. 2023 మూడో త్రైమాసికంలో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు 5శాతం పెరిగాయి. వార్షిక పెరుగుదల 19శాతం ఉంది. సగటు కార్పెట్ ఏరియా ధర రూ. 11,040 ఉన్నట్లు తాజా రిపోర్టులో పేర్కొంది. అత్యధిక ఇళ్ల ధరలు ముంబైలో ఉండగా ఇక్క చదరపు అడుగు ధర రూ. 19,585గా ఉంది. ఏడాదిలో ఇక్కడ ఇళ్ల ధరలు పెరుగుదల కేవలం 1 శాతం మాత్రమే ఉంది.

ఇది కూడా  చదవండి: గంధంతో అందం మీ సొంతం కావాలంటే…ఇలా వాడి చూడండి..!!

ప్రీమియం ప్రాజెక్టులు హైదరాబాద్ లో ఎక్కువగా ఐటీ కారిడార్ లోనే ఉన్నాయి. కొత్తగా సెంట్రల్ హైదరాబాద్ లో సబ్ మార్కెట్ ఏర్పడిందని రిపోర్టులో వెల్లడించింది. ఇక్కడ పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కొత్తవి కూడా వస్తున్నాయి. ప్రీమియం ప్రాజెక్టుల వల్ల సగటు ధరల్లో పెరుగుదల కారణమని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మూడో త్రైమాసికంలో అమ్ముడుపోని ఇళ్లను చూస్తే హైదరాబాద్ లో 9శాతంగా ఉన్నాయి. ముంబైలో అత్యధికంగా 38శాతం, పుణెలో 12, ఢిల్లీలో 11, అహ్మదాబాద్ లో 9 , చెన్నై, బెంగుళూరులో 8, కోల్ కతాలో 5శాతంగా ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు