Hyderabad: ఓయూలో నీళ్ల కష్టాలు.. హాస్టల్స్ మూసివేతపై విద్యార్థుల ఆందోళన!

ఓయూలో హాస్టల్స్ మూతివేత అంశం మరోసారి ఆందోళనలకు దారితీసింది. నీటి ఎద్దడి, కరెంటు కోత కారణంగా విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు వార్డెన్​ నోటీసు జారీ చేశారు. మే 14 నుంచి జూన్ 6 వరకూ మెస్, హాస్టల్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

New Update
Hyderabad: ఓయూలో నీళ్ల కష్టాలు.. హాస్టల్స్ మూసివేతపై విద్యార్థుల ఆందోళన!

Osmania university: చదవులు తల్లి, ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిలో హాస్టల్స్ మూతివేత అంశం మరోసారి ఆందోళనలకు దారితీసింది. నీటి ఎద్దడి, కరెంటు కోత కారణంగా విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు వార్డెన్​ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు మే 14 నుంచి జూన్ 6 వరకూ మెస్, హాస్టల్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే హాస్టల్ మూసివేతపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలు కల్పించకుండా సెలవుల సాకుతో ఇంటికి పంపించడం దారుణమని వాపోతున్నారు. అంతేకాదు వెంటనే ఓయూ వీసి స్పందించి వసతులు ఏర్పాటు చేయాలని, లేదంటే ధర్నా చేపడతామని హెచ్చరిస్తున్నారు.

publive-image

అర్ధరాత్రి నీళ్ళ కోసం ఆందోళన..
ఇదిలావుంటే.. గతేడాది సైతం ఇదే సమయంలో వేసవి సెలవుల పేరుతో మొదటిసారి నోటీసు రిలీజ్ చేశారు. కాగా మళ్లీ అదే సాకుతో హాస్టల్స్ క్లోజ్ చేస్తున్నట్లు నోటీసు జారీ చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. కాగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అర్ధరాత్రి నీళ్ళ కోసం ఆందోళనకు దిగారు. పేరుకే విశ్వవిద్యాలయం, విద్యార్దులకు కనీస వసతులు కూడా కలిపించట్లేదంటూ మండిపడ్డారు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకొక తీరు, ఉస్మానియా హాస్టల్లో ఉండే విద్యార్దులకు ఒక తీరా అని ప్రశ్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు