ఇది మానవాళికి అవమానకరమైన ఘటన. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా…మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. నిత్యం ఏదొక చోట మహిళ అవమానానికి గురవుతూనే ఉంది. తాజాగా మణిపూర్ లో జరిగిన ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. గత కొన్నాళ్లుగా మణిపూర్ లో కొనసాగుతున్న హింసకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పట్టపగలే కీచక పర్వం కొనసాగింది. కుకీ జాతికి చెందిన ముగ్గురు గిరిజన యువతులను నగ్నంగా ఊరేగించారు. అంతేకాదు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని హత్య చేసిన ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Manipur : మణిపూర్లో దారుణ ఘటన..నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం..!!
మణిపూర్ లో (Manipur) దారుణం చోటుచేసుకుంది. మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Social media) వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోను చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలపై సామాహిక అత్యచారానికి పాల్పడ్డారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది.

Translate this News: