Ongole Incident : చావబాది.. ముఖంపై మూత్రం పోసి.. మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోమని.. అత్యంత అమానవీయం!

ప్రకాశంజిల్లా ఒంగోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. గిరిజన యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు..ఆ తర్వాత మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోమంటూ చావబాదారు.

Ongole Incident : చావబాది.. ముఖంపై మూత్రం పోసి.. మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోమని.. అత్యంత అమానవీయం!
New Update

వీళ్లేం మనుషులు..? ఇంత ఘోరమా.. వీడియో చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. అత్యంత అమానవీయ ఘటన ఇది. కోపాలు, శత్రుత్వాలు, పగలు, ప్రతికారలు ఉంటే ఉండొచ్చు..కానీ ఇంత ఆటవికంగా ప్రవర్తిస్తారా..? ఓ గిరిజనుడిని తొమ్మిది మంది కలిసి చావబాదడంమే కాకుండా..నోట్లో మూత్రం పోసి.. మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని కర్రలతో చితకబాదిన ఘటన ప్రకంపనలు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ ఘటన గురించే చర్చ.. అత్యంత దారుణంగా ఒంగోలులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజుల ముందే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

publive-image బాధితుడిపై మూత్రం పోస్తున్న దుండగులు

అసలేం జరిగిందంటే...?
బాధితుడైన గిరిజన యువకుడి పేరు మోటా నవీన్, ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీళ్లద్దరిపై 50కు పైగా దొంగతనం కేసులున్నాయి. అయితే ఇటివలి కాలంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరినొకరు మాట్లాడుకోవడం కూడా తగ్గించేశారు. నెల రోజుల క్రితం మద్యం తాగుదామంటూ నవీన్‌ను అంజి ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వద్దకు పిలిచాడు. అంజి ఒక్కడే పిలిచాడనుకోని నవీన్‌ అక్కడికి వెళ్లాడు. కానీ అక్కడ చూస్తే తొమ్మిది మంది కనిపించారు. వారంతా కూడా కరుడుకట్టిన నేరస్థులే..అంతా కలిసి ఫుల్‌గా తాగేశారు. ప్లాన్‌ ప్రకారమే నవీన్‌కి కాస్త ఎక్కువ పట్టించారు. తాగిన మత్తులోకి వెళ్తున్న నవీన్‌పై ఒక్కసారిగా అందరూ కలిసి దాడి చేశారు. ఒకరి తర్వాత ఒకరు కాళ్లుతో నవీన్‌ని తన్నడం మొదలు పెట్టారు. నవీన్‌ ముఖంపై అనేకసార్లు తన్నారు. నవీన్‌ ముఖంపై నుంచి తీవ్రంగా రక్తం కారుతున్నా కనికరించలేదు. తాగిన మత్తులో విచక్షణ మరిచారు. సాటి మనషిని కొడుతున్నామన్న ఆలోచన కూడా వాళ్ల మెదడులోకి రాలేదు.

publive-image దాడి దృశ్యాలు

అంతటితో ఆగలేదు:
ముఖంపై బూటు కాళ్లతో ఎడాపెడా తన్నడంతోనే ఆగిపోలేదు దుర్మార్గులు. ఫ్యాంట్‌ జిప్‌ తీసి ఒకరి తర్వాత ఒకరు నవీన్‌ ముఖంపై మూత్రం పోశారు. కొందరు అతని నోరు తెరిచి నోట్లోనే యూరిన్‌ చేశారు. తమ మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేశారు. గాయాలతో నవీన్‌ ఎటు కదలలేని పరిస్థితులో ఉంటే పైశాచిక ఆనందం పొందారు. వీళ్లంతా ఒకప్పుడు కలిసి చోరీలు చేసినవాళ్లే..అనేక నేరాలు చేసినవాళ్లే. బాధితుడు కూడా నేరస్తుడే కావొచ్చు..గతంలో జైలుకెళ్లి కూడా ఉండొచ్చు..కానీ మానవత్వం అనేది ఉండాలి కదా.. తలెత్తిన గొడవను సాల్వ్ చేసుకుందామని పిలిచి ఇలా దాడి చేస్తారా..? ఇంత క్రూరంగా ఏ క్రూర మృగం కూడా ప్రవర్తించదు..ఉగ్రవాదులు చేష్టలను తలపించేలా సాగింది ఈ తొమ్మిద మంది అరాచకం.

publive-image కాళ్లతో దాడి చేస్తూ పైశాచిక ఆనందం

పోలీసులు ఏం చేస్తున్నారు.?
ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదు పోలీసులు..కేవలం ఇద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఇంత క్రూరమైన దాడిని SC/ST అట్రాసిటి కేసు కూడా బుక్‌ చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన తీరు నెటిజన్లు తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ వీడియోను చూసి సమాజం ఎటు పోతుందంటూ చాలా మంది బాధపడుతున్నారు. మానవహక్కులను ఇంత స్వేచ్ఛగా..యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారని.. వీడియో రిలీజ్‌ అయ్యేవరకు పోలీసులు పట్టించుకోలేదంటూ మండిపడుతున్నారు. ఈ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన తర్వాత పోలీసులు సీరియస్‌గా కేసును డీల్‌ చేయడం మొదలుపెట్టారని..ఒకవేళ వీడియో బయటకు వచ్చి ఉండకపోతే ఓ సెక్షన్‌ కేసు కింద మాత్రమే ఉండిపోయేదన్న ఆరోపణలు సోషల్‌మీడియా యూజర్ల నుంచి వినిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌ తరహా ఘటన:
ఇలాంటి ఘటనే రెండు వారాల క్రితం మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. 2020లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా ఈ నెల మొదట్లో బయటకు వచ్చింది. రాజకీయంగానూ అనేక టర్న్‌లు తీసుకున్న ఈ వీడియోపై ఇంకా వేడి చల్లారకముందే ఏపీలో ఇలాంటి ఘటనే వెలుగు చూడడం సంచలనం సృష్టించింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి