ఈ నెల 2న లీ ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే కోమాలోకి చేరుకుందని వాపోయారు. చివరికి జులై 5 బుధవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచిందని సోషల్ మీడియా వేదికగా కుటుంబసభ్యులు కన్ఫమ్ చేశారు. హాంకాంగ్‌లో జన్మించిన లీ శాన్ ఫ్రాన్సిస్కోలో పాప్ సింగర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించి టాప్ పొజీషన్‌లో నిలిచింది. తన 30 ఏళ్ల కెరియర్‌లోనే ఎన్నో ఆల్బమ్స్ విడుదల చేసి రికార్డులు సొంతం చేసుకుంది. అంతేకాదు తనకంటూ లక్షలమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది.
1996 సంవత్సరంలో సోనీ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఘనత అందుకున్న తొలి చైనీస్ అమెరికన్‌గా రికార్డులోకి ఎక్కింది. 1998లో ఆమె విడుదల చేసిన మాండరిన్ ఆల్బం డి డా డి మూడు నెలల్లోనే మిలియన్ కాపీలకు పైగా అమ్ముడుపోయాయంటే మనం అర్ధం చేసుకోవచ్చు ఆమెకు పాటలకు ఎంత పాఫులార్టీ ఉందో.అంతలా ఆకట్టుకున్న ఈ పాఫ్ సింగర్ అకాల మృతిపట్ల జీర్ణించుకోలేని ఆమె ఫ్యాన్స్ శోఖ సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు... ఆమె గానం మూగబోవడంతో పాటల శ్రోతలు సైతం ఆమె మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ఇలా చేస్తుందనుకోలేదంటూ చాలామంది ఫ్యాన్స్ తమ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.‘హిడెన్ డ్రాగన్’లోని ‘ఎ లవ్ బిఫోర్ టైమ్’సాంగ్ 2001లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదర్శన ఇచ్చిన తొలి చైనీస్ అమెరికన్ గానూ ఆమె రికార్డులకెక్కింది. అంతలోనే ఆమె తీవ్రమైన డిప్రెషన్‌కు లోనై బలవన్మరణానికి పాల్పడటం అందరిని కలచివేస్తుందని పాటలకు బ్రేక్ పడినట్లు అయింది. దీంతో అటు ఫ్యాన్స్, ఇటు ఆమె ఫ్యామిలీకి విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఇదిలా ఉంటే... ఆమె అంతలా క్రేజ్‌సొంతం చేసుకుంది. అయితే ఆమె డిఫ్రెషన్‌కి లోను కావాల్సిన అవసరం ఏముందని చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.