Online Honey Trap: హైదరాబాద్ లో రెచ్చిపోతున్న హనీట్రాప్ ముఠాలు..ఖాకీల పేరునే వాడేస్తున్న మోసగాళ్ళు!! సైబర్ మోసగాళ్ల ఆగడాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతుంది. వాళ్లు పాల్పడుతున్న నేరాకుల సైబర్ క్రైం పోలీసులు చెక్ పెడుతున్న కొద్దీ.. జాదూగాళ్లు మరో కొత్త కొత్త రకాల నేరాలకు తెర తీస్తున్నారు. దీంతో పోలీసులకు తిప్పలు తప్పడం లేదు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఆన్ లైన్ హనీ ట్రాప్ ముఠాలు ఏకంగా పోలీసుల పేరుతోనే మోసాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు... By P. Sonika Chandra 17 Aug 2023 in క్రైం New Update షేర్ చేయండి Online Honey Trap: సైబర్ మోసగాళ్ల ఆగడాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతుంది. వాళ్లు పాల్పడుతున్న నేరాకుల సైబర్ క్రైం పోలీసులు చెక్ పెడుతున్న కొద్దీ.. జాదూగాళ్లు మరో కొత్త కొత్త రకాల నేరాలకు తెర తీస్తున్నారు. దీంతో పోలీసులకు తిప్పలు తప్పడం లేదు. ఇక తాజాగా హైదరాబాద్ లో ఆన్ లైన్ హనీ ట్రాప్ ముఠాలు ఏకంగా పోలీసుల పేరుతోనే మోసాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ఆన్ లైన్లో హనీ ట్రాప్ లోకి అమాయకులను దింపుతూ.. పోలీసులమని బేరాసారాలకు దిగుతూ.. లక్షలు దోచేసుకుంటున్నారు. దీంతో బాధితులు పరువు ఎక్కడ పోతుందేమోనని కిమ్మనకుండా మోసగాళ్ళు అడిగినంత ఇస్తున్నారు. ఇక ఈ మధ్య వరుసగా హైదరాబాద్ లో బయటపడుతున్న ఇలాంటి సంఘటనలతో జనం బంబెలెత్తిపోతున్నారు. ఈ మధ్యే..50 ఏళ్ళ మాజీ ఆర్మీ ఆఫీసర్ ఇదే విధంగా ఆన్ లైన్ హనీ ట్రాపర్ చేతిలో చిక్కుకొని లక్షలు మోస పోయారు. ఇక ఆయన రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాగా, కొన్ని రోజుల క్రితం అతనికి ఓ వీడియో కాల్ వచ్చింది. దాన్ని ఆయన లిఫ్ట్ చేశారు. జస్ట్ 10 సెకన్లు మాత్రమే దాన్ని అటెండ్ అయ్యి.. అది న్యూడ్ కాల్ కావడంతో వెంటనే దాన్ని కట్ చేశారు. దాని తరువాత ఆ కాల్ ను మార్ఫింగ్ చేసి వీడియోను అప్ లోడ్ చేస్తానని ఓ వ్యక్తి ఆయనకు కాల్ చేసి బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో ఆయన అతనికి 50 వేల రూపాయలు పంపించారు. తరువాత బాధితుడికి ఓ అనౌన్ నెంబర్ నుంచి కొన్ని రోజుల తరువాత కాల్ వచ్చింది. అశ్లీల వీడియోలు కల్గిన ఉన్న ఓ మహిళను పట్టుకున్నామని... నేను పోలీసు ఆఫీసర్ ని అని అతడు పరిచయం చేసుకున్నాడు. బాధితురాలికి 22 లక్షలు ఇస్తే.. నేను మాట్లాడి సెటిల్ చేస్తానని అతడు బాధితుడికి ఆఫర్ ఇచ్చాడు. అదే విధంగా సోషల్ మీడియాలో ఇప్పటికే వీడియో పోస్ట్ అయిందని.. దాన్ని మీడియా ప్లాట్ ఫామ్ నుంచి డిలీట్ చేయడానికి డబ్బులు కావాలని ఆ డూబ్ పోలీసు ఆఫీసర్ తెలిపాడు. అంతే కాదు సమస్య రెడ్ టేప్ లో చిక్కుకున్నందుకు కేసును క్లోజ్ చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుందని అతడు మాజీ సైనికుడిని భయపెట్టించాడు. అయితే 22 లక్షలు ఎక్కువ అమౌంట్ కావడం.. అదే విధంగా కంటిన్యూగా ఫోన్ కాల్స్ రావడంతో.. ఆయన మోసం జరుగుతుందని భావించి పోలీసులను ఆశ్రయించాడు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి