ఈ హోంమేడ్ ఫేస్ వాష్ వాడితే బ్యూటిపార్లర్ వెళ్లాల్సిన అవసరమే ఉండదు..!!

కెమికల్ ఫ్రీ ఫేస్ వాష్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. మార్కెట్లో లభించే ఖరీదైన ఫేస్ వాష్‎లు ముఖంపై తాత్కాలిక ప్రభావమే చూపుతాయి. అంతేకాదు వాటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బేబీసోప్, దోసకాయతో ఇంట్లోనే కెమికల్ ఫ్రీ ఫేస్ వాష్ ను తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ముఖానికి ఎలాంటి హాని ఉండదు. చర్మం మెరుస్తూ నిగనిగలాడుతుంది.

ఈ హోంమేడ్ ఫేస్ వాష్ వాడితే బ్యూటిపార్లర్ వెళ్లాల్సిన అవసరమే ఉండదు..!!
New Update

వేసవి కాలంలో ముఖంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సీజన్‌లో చెమట,ముఖంపై జిడ్డు ఎక్కువగా వస్తుంది. పదే పదే ముఖం కడుక్కోవల్సి వస్తుంది. దానికోసం ఫేస్ వాష్ ఉపయోగిస్తుంటాం. మార్కెట్‌లో దొరుకుతున్న ఫేస్ వాష్‌లో చాలా రసాయనాలు ఉంటాయి. ఇవి ముఖానికి గ్లో తీసుకురావడానికి బదులుగా, దానిని నిర్జీవంగా మార్చేలా చేస్తాయి. కెమికల్స్ లేకుండా ఇంట్లోనే సులభంగా ఫేస్ వాష్ తయారు చేసుకోవచ్చు. వీటితో ముఖానికి ఎలాంటి హాని కలగదు. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోగలిగే సహజసిద్ధమైన ఫేస్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

homemade face wash

ఇంట్లోనే నేచురల్ ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవాలి?

ఇంట్లో ఫేస్ వాష్ తయారు చేసేందుకు మీకు 1 నిమ్మకాయ రసం, 2 దోసకాయల రసం, బేబీ సోప్, రోజ్ వాటర్, అలోవెరా జెల్ అవసరం. ఈ వస్తువులన్నీ మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి.

-ఫేస్ వాష్ తయారు చేయడానికి, ముందుగా మీరు 2 దోసకాయలను తురుముకోవాలి. వాటి రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

-ఇప్పుడు బేబీ సబ్బును తురుముకోవాలి. మీరు ఏదైనా బేబీ సబ్బును ఉపయోగించవచ్చు, బేబీ సబ్బులో రసాయనాలు ఉండవు.

-తురిమిన బేబీ సబ్బు, దోసకాయ రసం రెండూ కూడా బాగా మిక్స్ చేయండి. దీని కోసం మీరు చిన్న బీటర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

-సబ్బు, దోసకాయ రసం మిక్స్ చేసినప్పుడు దానిలో నిమ్మరసం కలపండి.

-చివరగా ఇందులో రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలపాలి.

-అంతే సింపుల్ ఇంట్లోనే కెమికల్ ఫ్రీ ఫేస్ వాష్ రెడీ. మీరు దీనిని శుభ్రమైన బాటిల్లో నింపి ఉపయోగించుకోవచ్చు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe