Home Tips: వర్షాకాలం ప్రజల్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తుందో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అర్థం అవుతుంది. చిన్నపాటి వానలు వస్తేనే చాలామందికి ఆనాగరోగ్య సమస్యలు, జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులు వస్తాయి. ఈ చిన్న సమస్యలు రాకుండా ఉండాలి అనేక జాగ్రత్తలు తీసుకుంటా. అంతేకాదు వానకాలంలో వచ్చే వరద వల్ల దోమలు, బురద ఎక్కువగా ఉంటుంది. దోమల వల్ల రోగాలు, బురద వల్ల బట్టలు పాడు అవుతాయి. ఈ వాతావరణంలో ప్రకృతి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ వర్షం వల్ల వచ్చే బురదను ఎవరూ ఇష్టపడరు. బట్టలపై బురద పడి బట్టలు శుభ్రం చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. పిల్లలు, ఇంట్లో ఎవరికైనా బురద వల్ల బట్టలు పాడైపోయి.. మరకలు శుభ్రంచేయాలంటే ఇంట్లో కొన్ని చిట్కాలు ఫాలో వచ్చు. ఆ చిట్కాలు ఎంటో ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.
మట్టి మరకలను తొలగించే చిట్కాలు:
- బట్టలపై మట్టి మరక కనిపించిన వెంటనే శుభ్రం చేయడానికి ప్రయత్నించాలి. ఒక్కసారి బురద పేరుకుపోతే దాన్ని శుభ్రం చేయడం కష్టమవుతుంది. అందుకని నీటిలో ముంచి బ్రష్‌తో బురదను శుభ్రం చేయాలి. చల్లటి నీటితో శుభ్రం చేసిన తర్వాత డిటర్జెంట్ వాడవచ్చు.
బేకింగ్ సోడా:
- బేకింగ్ సోడాలో సహజమైన స్టెయిన్ రిమూవర్ ఉంటుంది. ఇది మట్టి మరకలను తొలగిస్తుంది. బట్టలపై మరకలు మొండిగా ఉంటే బేకింగ్ సోడా పేస్ట్ బాగా పని చేస్తుంది. ఈ పేస్ట్‌ను మరలకు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మట్టి మరకలు సులభంగా తొలగిపోతాయి.
వినెగార్:
- మొండి మట్టి మరకలను తొలగించడానికి వెనిగర్ బెస్ట్. వెనిగర్‌ని నీళ్లలో కలిపి మరకులు ఉన్న బట్టలని కొద్దిసేపు ఉంచి తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. బురద మరకలను తొలగించడానికి నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. మట్టి మరకపై నిమ్మరసాన్ని పూయాలి కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో బట్టలను కడగాలి.
డ్రై క్లీనింగ్:
- బురద బట్టలు చేతితో ఉతకవచ్చు, వాషింగ్ మెషీన్ను ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలన్నింటినీ అనుసరించిన తర్వాత కూడా కొంత బురద ఉంటే డ్రై క్లీనింగ్‌కు ఇవ్వవచ్చు. వర్షాకాలంలో ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల పాడయ్యే దుస్తులను శుభ్రం చేసుకోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.