యువగళం పాదయాత్ర కాదు.. బ్రేకుల యాత్ర..హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు.!

నారా లోకేష్ యువగళం పాదయాత్రపై ఏపీ హోం మంత్రి తానేటి వనిత విమర్శలు గుప్పించారు."అన్ని బ్రేకులు తీసుకుంటున్నారు.. అసలు దానిని పాదయాత్ర అంటారా? లోకేష్ చేస్తున్నది పాదయాత్ర కాదు.. అది బ్రేకుల యాత్ర" అని చురకలు అంటించారు.

New Update
Taneti Vanitha: అందుకే జగన్ పై దాడి చేశారు: తానేటి వనిత

Home Minister Thaneti Vanitha: తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత విమర్శలు గుప్పించారు. "అన్ని బ్రేకులు తీసుకుంటున్నారు.. అసలు దానిని పాదయాత్ర అంటారా? లోకేష్ చేస్తున్నది పాదయాత్ర కాదు.. అది బ్రేకుల యాత్ర" అని వ్యంగ్యంగా మాట్లాడారు. ముందు వారు చేసేపనిని కరెక్ట్ గా చేయమనండి తరువాత ప్రభుత్వాన్ని ప్రశ్నించమనండి అని ఎద్దెవ చేశారు. ప్రజల నుండి సానుభూతి పొందడం కోసమే ఇలాంటి వన్ని చేస్తున్నారని మండిపడ్డారు.

లోకేష్ యువగళం పాదయాత్ర ఎట్టి పరిస్ధితిలోనూ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపదని అన్నారు. ఈ క్రమంలోనే రాజోలు ఎమ్మెల్యే రాపాక జనసేన నుండి వైసీపీలో చేరి అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలపై స్పందించారు. ప్రతిపక్షం పని ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించడమేనని.. సీఎం జగన్ మొదలుకుని ప్రతి వైసీపీ నాయకులను, మంత్రులను అవినీతి చేస్తున్నారంటూ ఆరోపించడమేనని కౌంటర్లు వేశారు.

Also Read: లోకేష్ ఒక జోకర్..మంత్రి సజ్జల కౌంటర్.!

కాగా, దేవీచౌక్ వద్ద ఏరియా పశువుల ఆసుపత్రిని ప్రారంభించారు ఏపీ హోమంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్. రూ. 35.95 లక్షలతో ఏరియా పశువైద్యశాల నూతన భవనంను నిర్మించారు. ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ..సీఎం ‌జగన్ ప్రజల ఆరోగ్యానికి ఎలా పెద్దపీఠ వేసారో, పశువుల ఆరోగ్యానికి సైతం పెద్ద పీఠవేస్తున్నారన్నారు. పశువుల‌ ఆరోగ్యం కోసం ఇంతగా ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు. సచివాలయాలలో వెటర్నరీ వైద్యం ద్వారా మూగజీవాల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. నాబార్డ్ నిధులతో పశువైద్యశాలలు నిర్మించడం శుభపరిణామం అని ప్రశంసించారు. వైసిపి పాలనలో ప్రజల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి భద్రత ఉందని వ్యాఖ్యనించారు.

Advertisment
తాజా కథనాలు