Bapatla: బాపట్ల జిల్లా ఇపురుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. బహిర్బూమికి వెళ్లిన ఓ యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. వెంటనే ఘటన ప్రదేశానికి వెళ్లాలని హోం మంత్రి అనితకు సీఎం ఆదేశం ఇచ్చారు. CM ఆదేశానుసారం హోంమంత్రి అనిత చీరాల చేరుకున్నారు.
Also read: వారు మర్యాదగా రాజీనామా చేస్తే బాగుంటుంది.. దాడి రత్నాకర్ స్వీట్ వార్నింగ్..!
సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించిన హోంమంత్రి వారికి సానుభూతి తెలిపారు.ప్రభుత్వ పరంగా ఆ కుటుంభానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దోషులను త్వరితగతిన పట్టుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి తోపాటు సంఘటన స్థలానికి స్థానిక MLA MM కొండయ్య చేరుకున్నారు.