Vishaka: పేలింది బాయిలర్ కాదు.. ఫార్మా కంపెనీ ప్రమాదంపై హోం మంత్రి సంచలన ప్రకటన! విశాఖ ఫార్మా కంపెనీ ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. భద్రత వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. MTBE అనే గ్యాస్ లీకేజ్, సాల్వెంట్‌తో కలవడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. ప్రమాదంలో 17మంది మరణించగా, 35 మంది చికిత్స పొందుతున్నారన్నారు. By Jyoshna Sappogula 22 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Vishaka: అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. 50మందికి పైగా గాయపడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటన మృతుల కుటుంబాలు, గాయపడ్డవారిని చంద్రబాబు పరామర్శించారు. అనంతరం..పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఫార్మా కంపెనీ ప్రమాదంపై తాజాగా హోం మంత్రి అనిత స్పందించారు. భద్రత వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. MTBE అనే గ్యాస్ లీకేజ్, సాల్వెంట్‌తో కలవడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందన్నారు. గ్యాస్ పేలుడు కారణంగా ప్రొడక్షన్ యూనిట్ గోడలు ధ్వంసం అయ్యాయని.. ప్రమాదంలో 17మంది మరణించగా, 35 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు. పరిశ్రమలో 381మంది సిబ్బంది పనిచేస్తున్నారని.. ఇప్పటి వరకు అందరినీ ట్రేస్ చేశామన్నారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఎసెన్సియా కెమికల్ ఫ్యాక్టరి ప్రమాదంపై ఘటనాస్థలాన్ని పరిశీలించడం జరిగింది.ఫార్మా ప్రమాదంపై అధికారలను ఆరా తీయడం జరిగింది.ప్రమాద బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. pic.twitter.com/LaIfBq3DWn — Anitha Vangalapudi (@Anitha_TDP) August 21, 2024 ముఖ్యమంత్రి క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ప్లాంట్ విజట్ కు వస్తారని తెలిపారు. యాజమాన్యం బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రమాదకరమైన సాల్వెంట్‌లు అన్నీ ఓపెన్ గా ఉన్నాయని.. యాజమాన్యం బాధ్యతారాహిత్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. #anitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి