విపక్షాల విశ్వాసం కోసమే ఈ అవిశ్వాసం..లోక్‌సభలో అమిత్‌షా ఫైర్‌

నైతికల విలువలు లేని పార్టీ కాంగ్రెస్‌ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విపక్షాల విశ్వాసం కోసమేనని విమర్శలు గుప్పించారు. దేశంలో 50కోట్ల మందికి ఉచితింగా వైద్యం అందిస్తున్నామని.. కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా మోదీ వ్యవహరించారని చెప్పారు.

author-image
By G Ramu
విపక్షాల విశ్వాసం కోసమే ఈ అవిశ్వాసం..లోక్‌సభలో అమిత్‌షా ఫైర్‌
New Update

విపక్షాల విశ్వాసం కోసమే ఈ అవిశ్వాసమంటూ లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. జన్‌ధన్‌ యోజన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారని ఆరోపించారు అమిత్‌షా. నైతిక విలువలు లేని రాజకీయ పార్టీ కాంగ్రెస్‌ అంటూ నిప్పులుచెరిగారు. 50కోట్ల మందికి మేము ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా మోదీ వ్యవహరించారని చెప్పుకొచ్చారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకు వచ్చారని ప్రతిపక్షాలపై అమిత్ షా ఫైర్ అయ్యారు. ఈ సభకు, ఈ దేశ ప్రజలకు తమ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం వుందన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో ఈ దేశ ప్రజలు చూస్తున్నారని చెప్పారు. వాళ్లకు అంతా తెలుసన్నారు. మనం ఇప్పుడు అభివృద్ధి రాజకీయాల్లో ఉన్నామన్నారు.

2004 నుండి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో వుందన్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు సరిహద్దు దాటి మన దేశంలోకి ప్రవేశించి సైనికుల తలలను నరికివేశారని అన్నారు. అప్పుపడు ఎవరూ ఏమీ చేయలేకపోయారన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో భారత్ 231 శాతం అభివృద్ధిని నమోదు చేసిందన్నారు. ప్రపంచంలోనే అది గరిష్ట వృద్ధి అన్నారు.

కొన్ని సార్లు ప్రభుత్వ మెజారిటీని చెక్ చేసేందుకు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకు వస్తాయన్నారు. ప్రభుత్వంతో పాటు ఈ సభకు కూడా ప్రధాని మోడీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తీసుకు వచ్చినప్పుడల్లా విధానాలు, నిర్ణయాలపై వాదనలు చేస్తారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడింట రెండొంతుల మెజారిటీతో కొలువు దీరిన ప్రభుత్వం తమదన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యంత కష్టపడి పనిచేసే ప్రధాని మోడీ అని అన్నారు. ప్రపంచంలోని పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. ప్రధాని మోడీ ఎప్పుడూ సెలవు తీసుకోలేదన్నారు. ప్రధాని మోడీ రోజుకు 17 గంటలు పని చేస్తారన్నారు. అవినీతి క్విట్ ఇండియా, వంశ పారంపర్య రాజకీయాలు ఈ దేశం నుంచి పోవాలని, ఉదాసీనత తొలగిపోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారన్నారు.

కూటముల నిజస్వరూపాన్ని ఈ అవిశ్వాస తీర్మానం బయట పెడుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. పీవీ నరసింహరావు హయాంలో కూడా అవిశ్వాస తీర్మానం వచ్చిందన్నారు. అప్పుడు ప్రభుత్వాన్ని కాపాడాలని కాంగ్రెస్ అనుకుందన్నారు. అప్పుడు విజయం సాధించిన కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలను జైల్లకు పంపించిందని తెలిపారు.

1999లో వాజ్ పాయ్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకు వచ్చారని చెప్పారు. అప్పుడు తాము కావాలనుకుంటే తాము ఎంపీలను కొనుగోలు చేసే వాళ్లమన్నారు. కానీ తాము అలా చేయలేదన్నారు. తాము కేవలం తమ ఉద్దేశాన్ని ప్రజల ముందు వుంచామన్నారు. అప్పుడు అవిశ్వాస తీర్మానంలో తాము ఒక్క ఓటు తేడాతో ఓడిపోయామని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ. 70,000 కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. తాము రుణమాఫీలను నమ్మబోమని చెప్పారు. అసలు ప్రజలు అప్పులు తీసుకోవద్దనదే తమ ఉద్దేశమన్నారు. అందుకే పలు పథకాల ద్వారా వచ్చే లబ్దిని బ్యాంకు అకౌంట్ల ద్వారా ప్రజలకే నేరుగా అందజేస్తున్నామన్నారు. అవి ఉచితాలు కావన్నారు. సర్వేలు చేయించిన తర్వాత 2.5 ఎకరాల కన్నా తక్కువ భూమి వున్న వారికి రూ. 6 వేలు ఇస్తున్నామన్నారు.

#no-confidence-motion #amit-shah #amit-shah-in-loksabha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe