Home Guard: నేనూ ఆత్మహత్య చేసుకుంటున్నా.. మరో హోంగార్డ్ మిస్సింగ్

తెలంగాణలో హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉందని.. పై అధికారులు వెట్టి చాకరీ చేయిస్తున్నారని వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని.. తన కుటుంబానికి మద్దతుగా నిలవండంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే హోంగార్డు మెసేజ్ తీవ్ర కలకలం రేపుతుంది.

Home Guard: నేనూ ఆత్మహత్య చేసుకుంటున్నా.. మరో హోంగార్డ్ మిస్సింగ్
New Update

Home Guard:  తెలంగాణలో హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉందని.. పై అధికారులు వెట్టి చాకరీ చేయిస్తున్నారని వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళ తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని.. తన కుటుంబానికి మద్దతుగా నిలవండంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు అనే హోంగార్డు మెసేజ్ తీవ్ర కలకలం రేపుతుంది. రాంబాబు స్వస్థలం కల్లూరు. రవీందర్ మృతితో తీవ్ర మానసిక ఒత్తిడికి హోంగార్డులు గురవుతున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ఇటీవల జీతాలు సరిగా రాక ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్యయత్నం చేసిన హోంగార్డు రవీందర్‌ శుక్రవారం ఉదయం కన్నుమూశాడు. అపోలో ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రవీందర్‌ ఇవాళ తుదిశ్వాస విడిచారు. హోంగార్డు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గోషామహల్‌ హోం గార్డు ఆఫీసులో ఆదివారం ఉదయం జీతాలు సరిగా ఇవ్వట్లేదని పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు రవీందర్‌. దీంతో ఆయన శరీరం సుమారు 70 శాతం కాలిపోవడంతో చికిత్స కోసం DRDO అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే కీడ్నీ, లివర్‌ పనీతిరు పూర్తిగా విషమంగా మారడంతో ఇవాళ ఉదయం 6 గంటలకు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల ముఖ్య కారణాలను రవీందర్‌ ఓ వీడియోలో వివరించారు. రవీందర్‌ చనిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయేమో అనే ఉద్దేశంతో ఉస్మానియా ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అందరూ కలిసే చంపేశారు..

ఉస్మానియా ఆసుపత్రికి వద్ద భార్య సంధ్య.. తన పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తన భర్తది ఆత్మహత్య కాదని, ఉన్నతాధికారులు చేసిన హత్య అని ఆమె ఆరోపించారు. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. 17 సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేసిన తన భర్తను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ కన్నీటిపర్యంత మయ్యారు. తన భర్త ఫోన్‌ను తీసుకున్న పోలీసులు దానిని అన్ లాక్ చేసి అందులోని డాటా మొత్తాన్నీ తొలగించారని సంధ్య ఆరోణలు చేశారు. ఏఎస్సై నర్సింగ్ రావు, కానిస్టేబుల్ చందులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

హోంగార్డులకు అధికారుల వార్నింగ్..

మరోవైపు రవీందర్ కుటుంబానికి మద్దతుగా హోంగార్డులు ఎవరూ వెళ్లకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. హోంగార్డులు అందరూ తమ విధుల్లోనే ఉండాలని, విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల బాధ్యతలను ఎస్సైలకు అప్పగించినట్లు తెలుస్తోంది.

రవీందర్ మృతికి ప్రభుత్వమే కారణం..

రవీందర్ మృతిపై బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రవీందర్ మృతికి ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హోంగార్డ్‌లకు కనీస ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వకుండా.. ప్రభుత్వం వేధింపులకు పాల్పడవొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హోంగార్డ్‌లు ఎవరు తొందరపడి.. ఆత్మహత్యలు చేసుకోవొద్దని.. పోరాడి సాధించుకుందాం తప్ప.. ఆత్మహత్యలు చేసుకొవద్దని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి:హోంగార్డ్ రవీందర్‌ను పరామర్శించిన కిషన్ రెడ్డి

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి