Indian Cows: ఆవుకు అవి తినిపిస్తే.. సంతానం, సంతోషం అన్నీ మీ సొంతం!

ఆవుకు బెల్లంతో చేసిన రొట్టె ఆహారంగా పెడితే ఎంతో మంచిది. ఇలా చేస్తే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. సంతానాన్ని, సంతోషాన్ని కోరుకునేవారు ప్రతిరోజూ ఉదయం బెల్లంతో చేసిన రొట్టెలు ఆవుకు తినిపించాలని పండితులు చెబుతున్నారు.

New Update
Indian Cows: ఆవుకు అవి తినిపిస్తే.. సంతానం, సంతోషం అన్నీ మీ సొంతం!

Indian Cows: భారతీయ సంస్కృతీ సంపదలకు గోమాత ప్రతీక. పూర్వకాలం నుంచి భారతీయులకు ఆరాధ్య దేవత. మానవులకు ఆవుకన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు అంటారు. గోవులో సకల ప్రాణికోటికీ జీవాధారమైనది. గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు, ధన సంపదలువృద్ధి పొందగలరు. హిందువులకు ఆవులు ఎంతో పవిత్రమయిన జంతువులు. ఆవులు పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమయినవి. అయితే ఆవుకి ఈ ఒక్క వస్తువు పెడితే చాలు. అష్ట ఐశ్వర్యాలు మీవెంటే ఉంటాయట. భారతదేశంలో ఆవుని గోమాతగా కూడా పిలుస్తారు. అంతేకాకుండా హిందూమతంలో ఆవుని తల్లి హోదా కూడా ఉంది. ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు నివసిస్తుంటారని చెబుతూ ఉంటారు. అందుకే హిందువులు ఆవుని గోమాతని పిలూస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి గోమాతకు కొన్ని ఆహారాలు పదార్థాలు పెట్టడం వలన జీవితంలో డబ్బు అన్నదానికి కొదవ ఉండదు. మరీ గోమాతకు ఎటువంటి ఆహార పదార్థాలు పెట్టాలో ఇప్పుడు మనం తలుచుకుందాం.

ఆవుకు ఇష్టమైన ఆహారం ఇదే:

ఆవుకు బెల్లం, రొట్టెతో చేసిన ఆహారంగా పెడితే ఎంతో మంచిది. అలాగే ఎటువంటి పనులు అయితే నెరవేరకుండా పెండింగ్‌లో ఉంటాయో ఆ పనులన్నీ నెరవేరుతాయి. సంతానాన్ని సంతోషాన్ని కోరుకునేవారు ప్రతిరోజు ఉదయం ఆమెకు బెల్లం తినిపించాలి. ఈ విధంగా చేయడం వల్ల సంతానం కలగడంతో పాటు  మంచి తెలివైన పిల్లలు పుడతారు నమ్ముతారు . అలాగే ఆవుకు నిత్యం బెల్లం రొట్టెలను పెడితే పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా అష్ట ఐశ్వర్యాలు పొందడంతో పాటు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: అధిక బరువుకు చెక్ పెట్టేందుకు ఈ వెజిటేబుల్ సలాడ్‌ బెస్ట్!

Advertisment
తాజా కథనాలు