/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Holi-in-Metro-jpg.webp)
ఒక్కోసారి కొన్ని వీడియోలు చూస్తే.. అది బరితెగింపు అనాలో.. విచ్చలవిడితనం అనాలో.. మానసిక చాపల్యం అనాలో అర్ధం కాదు. సోషల్ మీడియాలో పాప్యులర్ కావడానికి కొంతమంది చేసే పనులు చూస్తుంటే అరె ఏంట్రా ఇదీ.. అనిపించక మానదు. అందులోనూ ఢిల్లీ మెట్రోలో(Holi in Metro) ఇలాంటి వెకిలి విన్యాసాల వార్తలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రీల్స్ పేరుతొ అలంటి పనికిమాలిన పని చేసిన ఇద్దరు అమ్మాయిల గురించి తెలుసుకుందాం.
ఏం చేశారంటే..
#DelhiMetro is not for beginners at all. #Holihai
pic.twitter.com/eAyiLChZn2— Kumar Manish (@kumarmanish9) March 23, 2024
ఢిల్లీ మెట్రోలో(Holi in Metro) ఇద్దరు అమ్మాయిలు రంగులు పట్టుకుని.. అసభ్యకరమైన భంగిమలతో విన్యాసాలు చేస్తూ రంగులు ఒకరికి ఒకరు పూసుకుంటూ వీడియో తీసుకున్నారు. రీల్స్ కోసం ఇది చేసినట్టు చెబుతున్నారు. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు చేసిన పని చూస్తే చికాకు.. ఏవగింపు ఒకేసారి రావడం ఖాయం. పబ్లిక్ లో ఉన్నామనే సోయి లేదు. మనం చేసేపని చూసినవారు ముఖాన ఉమ్మేస్తారనే ఇంగితం లేదు. ఒంటి మీద స్పృహ లేనట్టుగా ఆ అమ్మాయిలు చేసిన పని మెట్రోలో (Holi in Metro)ప్రయాణిస్తున్నవారికి అసహ్యం కలిగేలా చేసింది.
ఛీ అంటున్న నెటిజన్లు..
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల వికృత చేష్టలుఈ అమ్మాయిల వికృతాన్ని కుమార్ మనీష్ అనే ఆయన తన X హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు ఈ అమ్మాయిలు చేరిన పనులకు ఛీ అంటున్నారు. ట్రెండింగ్ గా మారిన ఈ పోస్ట్ కు విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి.
Also Read: రాజకీయాల బురదలో డ్రైడ్ ఈస్ట్.. దీనికీ డ్రగ్స్ కి ఏమిటి సంబంధం?
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల వికృత చేష్టలుఢిల్లీ మెట్రో(Holi in Metro) అధికారులు ఏమి చేస్తున్నారు అని ఒకాయన ప్రశ్నించాడు. అసలు మెట్రోలో ఏమి జరుగుతోంది? ఇంత జరుగుతున్నా.. సివిల్ డ్రస్ లో ఉండే పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఏమి చేస్తున్నారు అని ఒకాయన సీరియస్ అయ్యారు. వీళ్ళనెవరు కొట్టలేదేమిటి ఇంకా అని ఒకాయన విరుచుకుపడ్డాడు. ఇంకో ఆయన.. ఢిల్లీ మెట్రో లో ఉమ్మి వేస్తే 200 రూపాయలు, చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే 2200 రూపాయలు, అలారం మిస్ యూజ్ చేస్తే 500 రూపాయలు ఫైన్. కానీ, ఇలాంటి రీల్స్ కి ఫైన్ లేదు. నీతి వాక్యాలు చెప్పడం కాదు.. ఇతరులకు ఇబ్బంది కలిగించే ఇలాంటి వాటిని ఆపండి అంటూ స్ట్రాంగ్ గా ఢిల్లీ మెట్రో(Holi in Metro) అధికారులను చెడుగుడు ఆడేశాడు.
ఏది ఏమైనా పబ్లిక్ ప్లేస్ లలో ఇలా అసభ్యకరమైన వీడియోలు చేసే వారిని కఠినంగా శిక్షించే వ్యవస్థ వస్తే తప్ప ఇలాంటి చెత్త పనులు చేసేవారు తగ్గరని అందరూ అంటున్నారు.
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల వికృత చేష్టలు
Follow Us