Holi 2024 : పాకిస్తాన్ లోనూ హోలీ సంబురాలు..అక్కడ ఆ ఆలయంలో హోలికా దహన్..!

మార్చి 25వ తేదీన దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా హోలీ పండుగను జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హిందూవుల ప్రధాన పండగల్లో ఒకటి. అన్ని పండగల వలే హోలీ పండగకు కూడా ఓ పురాణ కథ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

New Update
Holi 2024 : పాకిస్తాన్ లోనూ హోలీ సంబురాలు..అక్కడ ఆ ఆలయంలో హోలికా దహన్..!

Holi 2024 :  ఈ సంవత్సరం హోలికా దహన్ మార్చి 25న దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరగనుంది. ఈ హోలీ పండుగకు పాకిస్థాన్‌లోని ప్రహ్లాద్‌పురి ఆలయానికి చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. అన్ని పండగల వలే హోలీ పండగకు కూడా ఒక పురాణ కథ ఉంది. హోలీని జరుపుకునే కథ ఈ ఆలయానికి సంబంధించినది. దాని గురించి తెలుసుకుందాం.

ప్రహ్లాద్‌పురి ఆలయం:
ప్రహ్లాదపురి ఆలయం పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఉంది. దీనిని నరసింహ అవతారం గౌరవార్థం నిర్మించారు. ఈ ఆలయం పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని ముల్తాన్ నగరంలో ఉంది. మత విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయాన్ని భక్త ప్రహ్లాదుడు వేల సంవత్సరాల క్రితం నిర్మించాడు. ఈ ప్రదేశంలోనే హోలిక మంటల్లో కాలి బూడిదైందని చెబుతారు.ఈ ఆలయానికి సంబంధించి విశేషం ఏంటంటే..ఇక్కడే భక్తుడైన ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు ఒక స్తంభానికి కట్టివేశాడు. స్తంభం నుండి నరసింహుడు ప్రత్యక్షమై హిరణ్యకశిపుని సంహరించాడు. 1947 విభజన సమయంలో, ఈ ఆలయం పాకిస్తాన్ భాగానికి వెళ్ళింది. హోలీకి ముందు ఇక్కడ 9 రోజుల వేడుక జరిగేది. అయితే 1992లో బాబ్రీ కూల్చివేత తర్వాత ఈ ఆలయాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత ఇక్కడికి భక్తుల ప్రవేశంపై నిషేధం విధించారు.

ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశ్యపు రాక్షసుల రాజు. ప్రహ్లాదుడు మహావిష్ణువు గొప్ప భక్తుడు. కానీ హిరణ్యకశ్యపుడు తన కుమారుడిని దేవుడిని పూజించకుండా అడ్డుకున్నాడు. ప్రహ్లాదుని భక్తి చేయవద్దని కోరాడు కానీ అతను అంగీకరించకపోవడంతో ప్రహ్లాదుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఏ విధంగానూ చంపలేనప్పుడు, అతను తన సోదరి హోలిక సహాయం తీసుకున్నాడు. హోలికకు అగ్నిలో కాల్చకుండా ఉండే వరం వచ్చింది. ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంది. భగవంతుని దయతో ప్రహ్లాదుడు రక్షించిగా.. హోలిక బూడిదైంది. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడటంతో హిరణ్య కశ్యపునికి మరింత కోపం రావడంతో అతను బాల ప్రహ్లాదుని స్తంభానికి కట్టి చంపడానికి కత్తిని తీసుకుంటాడు. అప్పుడు విష్ణువు అవతారమైన నరసింహుడు ఆ స్తంభంపై ప్రత్యక్షమై హిరణ్యకశ్యపుని సంహరించాడు.

ఇది కూడా  చదవండి: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.10,000!