Bear In karimnagar: హమ్మయ్య...ఎలుగుబంటి చిక్కింది..ఊపిరి పీల్చుకున్న జనం!

కరీంనగర్ లో హల్ చల్ చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. దాదాపు 12 గంటల పాటు అటవీ అధికారులను ముప్పతిప్పలు పెట్టి ఎలుగుబంటి కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అయితే రేకుర్తి దగ్గర కనిపించడంతో అధికారులు దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు.

Bear In karimnagar: హమ్మయ్య...ఎలుగుబంటి చిక్కింది..ఊపిరి పీల్చుకున్న జనం!
New Update

Bear In karimnagar: కరీంనగర్ లో హల్ చల్ చేసిన ఎలుగుబంటి ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. దాదాపు 12 గంటల పాటు అటవీ అధికారులను ముప్పతిప్పలు పెట్టి ఎలుగుబంటి కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అయితే రేకుర్తి దగ్గర కనిపించడంతో అధికారులు దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయింది.

తరువాత ఎలుగుబంటిని రెస్క్యూ వాహనంలో అధికారులు జూ పార్క్ కు తరలించారు. మొత్తానికి ఎలుగుబంటి చిక్కడంతో ఫారెస్ట్ అధికారులు ఇంకా స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కరీంనగర్ జిల్లాలో జనం మధ్య ఎలుగుబంటి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలో ఉన్న రజ్వీ చమాన్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. అక్కడ నడిరోడ్డుపై సంచరిస్తూ జనాలను పరుగులు పెట్టించింది.

ఇక శనివారం ఉదయం కల్లా ఆ ఎలుగుబంటి రేకుర్తిలో నడిరోడ్డులో ప్రత్యక్షమై హల్ చల్ చేసింది. ఈ క్రమంలో ఎలుగుబంటి ఎక్కడి నుంచి ఎటాక్ చేస్తుందోనని నగరవాసులు హడలెత్తిపోయారు. ఇళ్ల తలుపులను మూసుకున్నారు. ఇక ఎలుగుబంటి రోడ్డు పై సంచరిస్తూ.. జనాలను వెంటాడుతున్న.. నగరవాసులు పరుగులు పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి