కోకాపేట తరహాలోనే బుద్వేల్ భూముల వేలం.. ఎకరం కనీసం రూ.20కోట్లు

హైదరాబాద్ మహానగరంలో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఎకరం రూ.100కోట్ల ధర పలికిందంటే నగరం ఎంతలా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోకాపేటలో భూముల వేలం ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం తెచ్చిపెట్టగా.. తాజాగా బుద్వేల్ ప్రాంత భూముల అమ్మకానికి సర్కార్ సిద్ధమైంది.

New Update
కోకాపేట తరహాలోనే బుద్వేల్ భూముల వేలం.. ఎకరం కనీసం రూ.20కోట్లు

కోకాపేట తరహాలోనే బుద్వేల్..

రోజురోజుకు హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నగరం శివారులో ఎకరం రూ.100కోట్ల ధర పలికిదంటే నగరం ఎంతలా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోకాపేటలో భూముల వేలంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో కోకాపేట్ తరహాలోనే బుద్వేల్ ప్రాంత భూముల అమ్మకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించేందుకు రెడీ అయింది.

ఎకరా కనీసం ధర రూ.20కోట్లు.. 

బుద్వేల్‌లో మొత్తం 14 ప్లాట్లను వేలం వేయనుంది. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాలుగా ఉంది. ఎకరాకు రూ. 20 కోట్ల కనీస ధర నిర్ణయించారు. ఆగస్టు 6వ తేదీన ప్రీబిడ్ సమావేశం, 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆగస్టు 10వ తేదీన ఈ-వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బుద్వేల్ భూములు ఎకరాకు సగటున రూ.40 కోట్ల ధరకు అమ్ముడుపోయినా ప్రభుత్వానికి కనీసం రూ.4 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

publive-image

సర్కార్‌కు కాసుల వర్షం..

హైదరాబాద్ శివారులోని కోకాపేట నియోపాలిస్ భూముల వేలం సర్కార్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. నగర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎకరం రూ.100 కోట్లకు అమ్ముడుపోయింది. హెచ్ఎండీఏ ఎకరానికి కనీస ధర రూ.35 కోట్లకు బిడ్డింగ్ మొదలు పెట్టగా.. ఆన్‌లైన్లో జరిగిన ఈ వేలంలో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడ్డాయి. ఈ వేలంలో అత్యధికంగా ఎకరం రూ.100.25 కోట్లు పలకగా.. అత్యల్పంగా రూ. 51.75 కోట్లకు అమ్ముడుపోయింది. గురువారం జరిగిన ఫేజ్ 2 వేలంలో 6, 7, 8, 9 ప్లాట్ల వేలం వేయగా ప్రభుత్వానికి రూ. 1532.50 కోట్ల మేర ఆదాయం వచ్చింది. తర్వాత 10,11,14 ప్లాట్లను విక్రయించారు. దీంతో మొత్తం 45.33 ఎకరాలకు గాను రూ.2వేల కోట్ల ఆదాయం వస్తుందని భావించగా.. రూ.3,319కోట్ల ఆదాయం వచ్చింది. 2021లో ఇదే ఏరియాలో వేలం నిర్వహించగా కనిష్టంగా ఎకరా రూ. 31 కోట్లు ,గరిష్టంగా రూ. 60 కోట్లు పలికింది. కోకాపేటలో అభివృద్ధి చేసిన లే అవుట్‌ కోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ. 300 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు