HISTORIC STAND : చారిత్రాత్మక టెస్ట్ విజయానికి 23 ఏళ్లు!

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 2001 మార్చి14 న ఓ మర్చిపోలేని విజయాన్ని భారత్ సాధించింది. భీకరమైన ఫాం లో ఉన్న కంగారులను బ్యాటింగ్ లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ బౌలింగ్ లో హర్భజన్ సింగ్  మట్టి కరిపించారు.   

New Update
HISTORIC STAND : చారిత్రాత్మక టెస్ట్ విజయానికి 23 ఏళ్లు!

Test Cricket : భారత టెస్ట్ క్రికెట్(India Test Cricket) చరిత్రలో 2001 మార్చి14 న ఓ మర్చిపోలేని విజయాన్ని భారత్ సాధించింది. భీకరమైన ఫాం లో ఉన్న కంగారులను బ్యాటింగ్ లో వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman), రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid)  బౌలింగ్ లో హర్భజన్ సింగ్  మట్టి కరిపించారు.

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మార్చి 14 2001 భారత్ ,ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ప్రపంచ టెస్ట్ క్రికెట్ కు భారత్ ను పరిచయం చేసింది. అప్పటికే  16 టెస్ట్ విజయాలతో దూసుకుపోతున్న కంగారుల విజయాన్ని భారత్ కట్టడి చేయటమే కాకుండా, ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచిన మూడవ జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో 171 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి భారత్  చరిత్ర సృష్టించింది. భారత్ వేదిక గా మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు  భారత్ కు వచ్చింది. మొదట వాంఖడే(Wankhede) లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాత రెండో టెస్ట్ ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచిన  బ్యాటింగ్ ఎంచుకుంది. కంగారులు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో   హర్భజన్ సింగ్  ఏడు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్  171 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఆస్ట్రేలియా  276 పరుగుల ఆధిక్యం ఉండటంతో  కెప్టేన్  స్టీవ్ వా  భారత్ ను ఫాలో ఆన్ కు ఆహ్వానించాడు. ఫాలో ఆన్ కు దిగిన భారత్ ఆటగాళ్లు శివసుందర్ దాస్ 39, ఎస్ రమేష్ 30, సచిన్ టెండూల్కర్ 10 పరుగులతో వెనుదిరిగారు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న వీవీఎస్ లక్ష్మణ్ కు భారత కెప్టేన్ గంగూలీ ఓ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. 232 పరుగుల వద్ద గంగూలీ వెనుదిరిగారు. క్రీజులోకిి వచ్చిన రాహూల్ ద్రావిడ్ 5 వికెట్ కు 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ 4వ రోజు,  ఆటముగిసే సమయానికి  589/4 ముగించింది.  5వ రోజున, లక్ష్మణ్  281 పరుగులతో ద్రావిడ్ 180 పరుగులు ఔటయ్యారు. 657/7 వద్ద భారత్ డిక్లేర్డ్ చేసింది.

ఆస్ట్రేలియా(Australia)  విజయం సాధించాలంటే  చివరి రోజు 75 ఓవర్లలో 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. హర్భజన్ తన స్పిన్ మాయాజాలంతో  6 వికెట్లు తీసాడు. పార్ట్ టైం బౌలర్ గా వచ్చి సచిన్  హేడెన్, గిల్‌క్రిస్ట్వార్న్‌లను అవుట్ చేశాడు. దీంతో   ఆస్ట్రేలియాపై 171 పరుగుల చారిత్రాత్మక విజయాన్ని భారత్ నమోదు చేసింది.

Also Read : Cricket: కమాన్ టీమ్ ఇండియా.. 4 అగ్రస్థానాలు కైవసం చేసుకున్న రోహిత్ సేనా!

Advertisment
తాజా కథనాలు