Manipur: రెండు దశాబ్దాల తర్వాత మణిపూర్ లో హిందీ సినిమా బహిరంగ ప్రదర్శన..!

మణిపూర్ లో ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అక్కడి హ్మర్ స్టూడెంట్స్ అసోసియేషన్(హెచ్ఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇటీవల అత్యంత హింస చోటు చేసుకున్న చురచాంద్ పూర్ జిల్లాలోని రేంగ్ కాయ్ లో ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించినట్టు హెచ్ఎస్ఏ ప్రకటించింది.

author-image
By G Ramu
Manipur: రెండు దశాబ్దాల తర్వాత మణిపూర్ లో హిందీ సినిమా బహిరంగ ప్రదర్శన..!
New Update

మణిపూర్ లో ఇప్పుడిప్పుడే అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా అక్కడి హ్మర్ స్టూడెంట్స్ అసోసియేషన్(హెచ్ఎస్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇటీవల అత్యంత హింస చోటు చేసుకున్న చురచాంద్ పూర్ జిల్లాలోని రేంగ్ కాయ్ లో ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించినట్టు హెచ్ఎస్ఏ ప్రకటించింది.

మొత్తం నాలుగు చిత్రాలను బహిరంగంగా ప్రదర్శించాలని హెచ్ఎస్ఏ నిర్ణయించింది. అందులో యూరీ, ద సర్జికల్ స్ట్రైక్, షారుఖాన్ నటించిని కుచ్ కుచ్ హోతా హై సినిమాలు వున్నట్టు ప్రకటనలో పేర్కొంది. దశాబ్దాలుగా ఆదివాసీలను అణగదొక్కుతున్న మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, తీవ్రవాద గ్రూపులపై తమ ధిక్కారాన్ని, వ్యతిరేకతను తెలియజేసేందుకే ఈ సినిమాలను ప్రదర్శిస్తున్నామని పేర్కొంది.

2006లో హెచ్ఎంఏఆర్ కొండ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్దరించేందుకు ఇండియన్ ఆర్మీ చేసిన ప్రయత్నాలకు మద్దతు తెలిపినందుకు గ్రామస్తులకు గుణపాఠం చెప్పాలని కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ అనుకుందని తెలిపింది. ఆ క్రమంలో గ్రామంలోని 20 మంది మహిళలు, కొందరు బాలికలపై కంగ్లీ పాక్ దళ సభ్యులు అత్యాచారాని పాల్పడ్డారని ప్రకటనలో వెల్లడించింది. మళ్లీ ఇప్పుడు 2023లో తాము ఆధిపత్య వర్గానికి చెందిన ముఖ్యమంత్రి నేతృత్వంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత హింసకు బలవుతున్నామని చెప్పింది.

12 సెప్టెంబర్ 2002లో రాష్ట్రంలో హిందీ సినిమాల ప్రదర్శనపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) రాజకీయ విభాగం అయిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ ( ఆర్పీఎఫ్) నిషేధం విదించింది. ఆ ప్రకటన వెలుపడిన వారం రోజుల్లోనే రాష్ట్రంలోని సినిమా ధియేటర్ల నుంచి సేకరించిన దాదాపు 6,000 నుంచి 8,000 వరకు ఆడియో, వీడియో క్యాసెట్లు,సీడీలను ఆర్పీఎఫ్ సభ్యులు కాల్చి వేశారు.

#manipur #surgical-strike #uri #kuch-kuch-hota-hai #hindi-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe