Hindenburg : మార్కెట్ కుప్పకూలుతుందా... భారత్ గురించి హిండెన్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు! అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మరోసారి పెద్ద అంశంతో తెరమీదకు వచ్చింది. ఆ సంస్థ తాజాగా భారత్ ను ఆందోళనకు గురి చేసే ప్రకటనను చేసింది. శనివారం ఉదయం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ఆ పోస్టులో పేర్కొంది. By Bhavana 10 Aug 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Hindenburg Sensational Comments : అమెరికా (America) కు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) సంస్థ మరోసారి పెద్ద అంశంతో తెరమీదకు వచ్చింది. ఆ సంస్థ తాజాగా భారత్ ను ఆందోళనకు గురి చేసే ప్రకటనను చేసింది. శనివారం ఉదయం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ఆ పోస్టులో పేర్కొంది. అమెరికన్ కంపెనీ భారతీయ కంపెనీకి సంబంధించిన మరో పెద్ద అంశాన్ని బయటపెట్టేందుకు యత్నిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను చేరుకుంటున్నారు. తాజాగా ఈ పోస్ట్ పెట్టడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. Something big soon India — Hindenburg Research (@HindenburgRes) August 10, 2024 అయితే ఇది ఏ విషయంలో అనేది గురించి మాత్రం హిండెన్ బర్గ్ చెప్పలేదు. అయితే మరోసారి ఓ పెద్ద భారతీయ కంపెనీ గురించి పెద్ద విషయాన్నే బయటపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. రెండు సంవత్సరాల క్రితం జనవరి 2023లో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీ (Gautam Adani) కి చెందిన అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ అనేక తీవ్రమైన ఆరోపణలు చేసినందున ఈ నివేదిక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఆ సమయంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వెలువడిన వెంటనే.. అదానీ గ్రూప్‌లోని అన్ని షేర్లలో భారీ క్షీణత సంభవించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రపంచంలో నంబర్ 2 బిలియనీర్ గా ఉన్న అదానీ 36వ స్థానానికి పడిపోయిన విషయం కూడా తెలిసిందే. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌నకు సంబంధించిన నివేదికను బయటపెట్టడానికి రెండు నెలల ముందే న్యూయార్క్‌కు చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్‌డన్‌కు పంపినట్లు సెబీ విచారణ లో తెలిసింది. హిండెన్‌బర్గ్ వ్యూహాత్మకంగా అదానీ గ్రూప్ షేర్ల ధరను తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందేందుకు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. కింగ్‌డన్ కంపెనీ కింగ్‌డన్ క్యాపిటల్‌కి కూడా కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌లో అధిక సంఖ్యలో షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత కంపెనీ వాల్యూ కూడా అతి తక్కువ సమయంలోనే పడిపోయింది. అతి తక్కువ కాలంలోనే అదానీ గ్రూప్ వాల్యుయేషన్ 86 బిలియన్ డాలర్లు పడిపోయిన పరిస్థితి నెలకొంది. షేర్ ధరలో ఈ భారీ పతనం తరువాత సమూహం విదేశీ లిస్టెడ్ బాండ్లను భారీగా విక్రయించింది. Also Read : ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే? #america #india #hindenburg-research మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి