Gold Price: ఈవారంలో మూడురోజుల పాటు తగ్గుదల కనబర్చి.. గోల్డ్ లవర్స్ కు ఆశలు రేకెత్తించిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. బంగారం ధరలు ఇకపై తగ్గే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ, పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు జరగకపోవడం.. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉండడంతో మళ్ళీ బంగారం ధరలు పెరగవచ్చని భావిస్తున్నారు. బంగారం ధరల(Gold Price)పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుదల కనబరిచాయి.
సాధారణంగా బంగారం ధరలు(Gold Price) ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరాలేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, క్రమేపీ బంగారం ధరల్లో నిలకడ కనిపిస్తూ వచ్చి కాస్త ఆశలు రేపిన బంగారం ధరలు.. మళ్ళీ మెల్లగా పైకి కదులుతున్నాయి. బంగారం ధరల(Gold Price) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు బంగారం ధర ల్లో మార్పులకు కారణంగా నిపుణులు చెబుతారు. ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి.
పూర్తిగా చదవండి..