Highest Mileage Cars: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం..

ప్రస్తుత కాలంలో ప్రజలు ఎక్కువగా తమకంటూ సొంత వాహనం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా ఊర్ల ప్రయాణాలు సాగించేందుకు ఒక కారు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఆలోచనలే కాదు..తమకు అనువైన కారును కొనుగోలు చేస్తున్నారు కూడా. అయితే, చాలా మంది ప్రజలు కారును కొనుగోలు చేసేందుకు అత్యధిక మైలేజీని అందించే కార్లను కొనుగోలు చేస్తున్నారు. మైలేజీ ఇచ్చే కార్లు ఇవే: మారుతి సుజుకి సెలెరియో, మారుతి వ్యాగన్ R, మారుతి సుజుకి ఆల్టో కె10, సుజుకి S-ప్రెస్సో, సుజుకి డిజైర్.

New Update
Highest Mileage Cars: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం..

Highest Mileage Cars: ప్రస్తుతం భారీగా పెరిగిన ఇంధన ధరలతో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు.. అత్యధిక మైలేజీ ఇచ్చే కార్ల గురించి ఆలోచిస్తున్నారు. మైలేజీ ఎక్కువగా ఇచ్చే కార్లను కొనుగోలు చేసేందుకే ఇంట్రస్ట్ ఎక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా సీఎన్‌జీ కార్ల వైపు దృష్టి సారిస్తున్నారు. మీరు కూడా మంచి మైలేజీ ఇచ్చే సీఎన్‌జి కార్లను కొనుగోలు చేయాలాని భావిస్తున్నారా? అయితే, మీకోసమే అత్యధిక మైలేజీ అందించే సీఎన్‌జీ కార్ల వివరాలను తీసుకువచ్చాము. సీఎన్‌జీ తో ఇవి అత్యధిక మైలేజీని అందిస్తాయి.

అత్యధిక మైలేజీని అందించే టాప్ 5 కార్ల వివరాలివే..

1. మైలేజీ పరంగా ఈ లిస్ట్‌లో మొదటి పేరు మారుతి సుజుకి సెలెరియో చెప్పుకోవచ్చు. ఇది సీఎన్‌జీలో కేజీ గ్యాస్‌కు 34.43 కిలోమీటర్లు మైలేజీ వస్తుంది.

Also Read:చలికాలంలో శరీరాన్ని కాపాడే మెంతి

2. ఇక రెండవ CNG కారు హ్యాచ్‌బ్యాక్ మారుతి వ్యాగన్ R. ఇందులో 1.0లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. ఈ కారు కిలోకు 34.05 కిమీ మైలేజీని ఇవ్వగలదు.

3. మారుతి సుజుకి ఆల్టో కె10 మూడవ స్థానంలో ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు దశాబ్దాలుగా దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. ఈ కారు CNG వేరియంట్‌లో విక్రయించడం జరుగుతోంది. మైలేజ్ 33.85 km/kg.

4. మారుతి సుజుకి S-ప్రెస్సో. ఇది CNG వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు 32.73 కిమీ/కిలో మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

5. సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, దేశీయ విపణిలో మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కారు మారుతి సుజుకి డిజైర్. కంపెనీ ప్రకారం.. CNG మోడ్‌లో 31.12 km/kg వరకు మైలేజీని పొందవచ్చు.

Also Read:డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా?

Advertisment
Advertisment
తాజా కథనాలు