Train Accident : యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్(Yesvantpur Express) రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. లోకో పైలెట్(Loco Pilot) సమయస్పూర్తిలో వ్యవహిరించడంతో వేలాది మంది ప్రాణాలతో మిగిలారు. రైలు పట్టాలపై హై వోల్టేజీ విద్యుత్ తీగను గమనించి ఎమర్జెన్సీగా రైలును ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
కర్నాటక(Karnataka) లోకి తుముకూరు జిల్లా కుణిగల్ పట్టణ శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేలాది మంది ప్రయాణికులతో యశ్వంత్ పుర్ ఎక్స్ ప్రెస్ హాసన్ కు శుక్రవారం ఉదయం బయలుదేరింది. మధ్యాహ్నం 12.15గంటల సమయంలో కుణిగల్ పట్టణ సమీపంలో రైల్వే ట్రాక్ పై వోల్టేజీ విద్యుత్ లైన్(High Voltage Electric Wire) పడి ఉండటాన్ని గమనించిన లోకో పైలట్ రైలును ఆపివేశాడు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. లోకో పైలట్ సమయస్పూర్తిని ప్రయాణికులు అభినందించారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారం అందించారు లోకో పైలట్. ఆ తర్వాత బెంగుళూరు నుంచి వచ్చిన రైల్వే టెక్నికల్ సిబ్బంది విద్యుత్ తీగను పట్టాలపై నుంచి తీసివేశారు.
ఇది కూడా చదవండి : తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఓ మహిళ దుర్మరణం.!