/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/palnadu.png)
హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో రెండో రోజు 144 సెక్షన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో మాచర్ల, గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఈ నాలుగు నియోజకవర్గాలలో షాపులను మూసివేయించారు పోలీసులు. బ్యాంకులు, సినిమా థియేటర్లు క్లోజ్ చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరో వైపు ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.