వినుకొండలో ఆగని ఉద్రిక్తతలు.. పేలుతున్న మాటల తూటాలు పల్నాడు జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకచోట గొడవలు చోటుచేసుకుంటూనే ఉంటున్నాయి. మొన్న మాచర్ల, నరసరావుపేటలో ఉద్రిక్తతలు తలెత్తగా.. తాజాగా వినుకొండలో రణరంగం తలపించేలా పరిస్థితులు నెలకొన్నాయి. By BalaMurali Krishna 28 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి కొనసాగుతున్న మాటల తూటాలు.. వినుకొండలో మొదలైన టీడీపీ, వైసీపీ వర్గీయుల వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. వినుకొండ అభివృద్ధికి టీడీపీ చేసిందేమీ లేదని విమర్శించారు బ్రహ్మనాయుడు. ఈ నాలుగేళ్లలో తాను ఎంతో అభివృద్ధి చేశానన్నారు. అది చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు కుట్రపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారం కోసమే టీడీపీ అల్లర్లు సృష్టిస్తోందని.. తనని అడ్డు తొలగించుకుంటే వినుకొండలో సులభంగా విజయం సాధించవచ్చని టీడీపీ ప్రణాళిక రచిస్తోందని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో తన గన్‌మెన్‌కు గాయాలయ్యాయని తెలిపారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తన డెయిరీలోకి టీడీపీ నేతలు అక్రమంగా ప్రవేశించారని.. తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. అందుకే పోలీసులకు తన గన్‌మెన్లు ఫిర్యాదుచేశామన్నారు. ఫిర్యాదుచేస్తే అక్రమ కేసులు పెట్టారని బుకాయిస్తున్నారని.. ఘర్షణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. వినుకొండలో 144 సెక్షన్.. కాగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం వినుకొండలో టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడి వాహనం ఎదురుపడటంతో టీడీపీ కార్యకర్తలను చూసి బ్రహ్మనాయుడు మీసం తిప్పారు. కారు దిగి తనపై ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే వాహనంపై దాడికి దిగారు. టీడీపీకి పోటీగా వైసీపీ కార్యకర్తలు కూడా రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తలలు కూడా పగిలాయి. దాంతో అక్కడ యుద్ధవాతారణం ఏర్పడింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉండటంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. నరసరావుపేటలోనూ ఉద్రిక్తత.. గతంలో నరసరావుపేటలో కూడా టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై చల్లా సుబ్బారావు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో టీడీపీ నేత చల్లా సుబ్బారావు నివాసంపై దాడికి దిగారు. టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సుబ్బారావు ఇంటికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలను చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాలు చేసుకున్న రాళ్ల దాడిలో పోలీసుల జీపుతో పాటు టీడీపీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని 144 సెక్షన్ కూడా విధించారు. మాచర్లలో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి