AP: నెల్లూరులో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కోటంరెడ్డి V/S పోలీస్‌..!

నెల్లూరు కార్పొరేషన్‌ ఆఫీసులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే కార్పొరేషన్‌ ఆఫీసులోకి వెళుతుండగా..ఆయన వెంట ఉన్న కార్పొరేటర్లను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.

New Update
AP: నెల్లూరులో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కోటంరెడ్డి V/S పోలీస్‌..!

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు కార్పొరేషన్‌ ఆఫీసులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే కార్పొరేషన్‌ ఆఫీసులోకి వెళుతుండగా.. ఆయనతో పాటు ఉన్నా కార్పొరేటర్లు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒక్కరే లోపలికి వెళ్లాలని మిగితా వారిని లోపలికి అనుమతించలేదు.

దీంతో, తనకోసం కష్టపడ్డ కార్యకర్తలను ఎందుకు లోపలికి రానివ్వరంటూ పోలీసులపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐకి వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు నినాదాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Also Read: భారత్‌కు మూడో మెడల్‌.. షూటింగ్‌లో రఫ్పాడించిన స్వప్నిల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు