/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-13T165415.215.jpg)
Narasaraopet: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనవాసరెడ్డి(Gopireddy srinivasa reddy) ఇంటిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసుల ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.