/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/fire-1.jpg)
Eluru: ఏలూరు జిల్లా దెందులూరు నియోజవకర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిత్యం ఏదొక వివాదంతో రాష్ట్రవ్యాప్తంగా దెందులూరు నియోజకవర్గం చర్చనీయాంశమవుతోంది. రెండ్రోజుల క్రితం తెలంగాణ బోర్డర్ లో గుబ్బల మంగమ్మ గుడి వద్ద తెలంగాణ వాసులతో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు గొడవకు దిగిన సంగతి తెలిసిందే.
Also Read: సంచలనంగా అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు.. 40 గంటలు దాటినా దొరకని నిందితుడి ఆచూకీ.!
తాజాగా, దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం గ్రామంలో గత అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. అర్ధరాత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ముఖ్య అనుచరుడి ఇంటిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేశారు. అక్కడ ఉన్న బైక్ లకు నిప్పు అంటించి.. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు.
Also Read: వైఎస్ఆర్ జయంతి వేడుకల వేదిక మార్పు.. కార్యక్రమానికి దూరంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు.!
పోలీసుల సమక్షంలోనే వైసీపీ నాయకుడిపై దాడికి యత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక దెందులూరు ప్రజలు భయాందోళనలో బ్రతుకుతున్నారు.