Adilabad: మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత.. హనుమాన్‌ భక్తులు ఆందోళన..!

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను స్కూల్ లోకి అనుమతించకపోవడంపై వివాదం చోటుచేసుకుంది. దీంతో, స్కూల్‌ లోపల హనుమాన్‌ దీక్షలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిరసన చేపట్టారు.

New Update
Adilabad: మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత.. హనుమాన్‌ భక్తులు ఆందోళన..!

Mother Teresa School: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్‌థెరిసా పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను స్కూల్ లోకి అనుమతించకపోవడంపై వివాదం జరిగింది. దీంతో, స్కూల్‌ లోపల హనుమాన్‌ దీక్షలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నిరసన చేపట్టారు.పెద్దసంఖ్యలో స్కూల్‌ దగ్గరకు చేరుకున్న హనుమాన్‌ భక్తులు..జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు.

Also Read: కుక్కల దాడికి రెండు గోడల మధ్య చిక్కుకున్న చిన్నారి.. చివరికి…


హనుమాన్‌ మాలధారణ విద్యార్థులను టీచర్స్‌ క్లాస్‌రూమ్‌లోకి రానివ్వలేదు. దీంతో, పిల్లలు క్లాస్ బయట ఉండాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు పిల్లలను బయటే నిల్చోబెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సోలీసులకు సమాచారం అందించారు. స్కూల్ దగ్గరకు చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు