/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/vamshi.jpg)
Vallabhaneni Vamsi : విజయవాడలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇంటి వద్ద టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కారుపైకి ఎక్కి వంశీ బయటికి రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారంలో ఉండగా తమపై అక్రమ కేసులు బనాయించడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నారా లోకేశ్, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also read: రెండు దశాబ్దాల తర్వాత ఇలా జరిగింది.. ఎమ్మెల్యే జయకృష్ణ షాకింగ్ కామెంట్స్..!
దీంతో వల్లభనేని వంశీ ఇంటిదగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వంశీ నివాసం ఉంటే అపార్ట్‌మెంట్‌పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో వంశీకి చెందిన రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదానికి దిగారు.