AP: నంద్యాలలో వైసీపీ నేత హత్యపై జగన్‌ సీరియస్‌.. పార్టీ నేతల్ని ఇలా చేయమని చెబుతూ..

నంద్యాల జిల్లా సీతరామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడి హత్య కలకలం రేపుతోంది. ఘటనపై మాజీ సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. హత్యకు గురైన సుబ్బారాయుడి ఇంటికి పార్టీ నేతల్ని పంపారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు టెన్షన్ పడుతున్నారు.

AP:  నంద్యాలలో వైసీపీ నేత హత్యపై జగన్‌ సీరియస్‌.. పార్టీ నేతల్ని ఇలా చేయమని చెబుతూ..
New Update

Nandyal: నంద్యాల జిల్లా సీతరామపురంలో ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ నేత సుబ్బారాయుడి హత్యపై మాజీ సీఎం  జగన్‌ సీరియస్‌ అయ్యారు. హత్యకు గురైన సుబ్బారాయుడి ఇంటికి పార్టీ నేతల్ని పంపించారు. రాష్ట్రంలో ముఠాల పాలన కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిందన్నారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదన్నారు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే ఈ ఘటనలు జరుగుతన్నాయన్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటం చేస్తామన్నారు వైసీపీ అధినేత జగన్.

మంత్రి అనిత రాజీనామా చేయాలి..

జగన్ ఆదేశాల మేరకు హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. సీతరామాపురం ఘటన పై వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ.. మంత్రి అనితపై మండిపడ్డారు. 'నువ్వు పరిపాలన చేయడానికి వచ్చావా... లేకుంటే లా అండ్ ఆర్డర్ తప్పించి హత్యా రాజకీయాలు చేయడానికి వచ్చావా.. అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి అనిత రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరుగుతున్న పట్టించుకోలేదు కాబట్టి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో పోలీసులకే దిక్కులేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

పవన కళ్యాణ్ ఎక్కడ?

తమ నియోజకవర్గంలో అస్పరి మండలం బిలేకల్ లో జరిగిన దాడిలో పదిమందికి పైగా కళ్ళు చేతులు పోయాయన్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్న పవన కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? ఎక్కడికి వెళ్ళాడు? జగనన్న మీదకి ఒంటికాలుతో వచ్చేవాడు ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నిలదీశారు. చంద్రబాబు, పవన్ కలిసి ఈ హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  పవన్ కళ్యాణ్ బయిటికి వచ్చి జరిగే ఘటనలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Also Read: RTV ట్వీట్ కు స్పందించిన ఇండియన్ రైల్వే.. నిన్న విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణ!

ఇక తిరగబడుతాం..

సుబ్బరాయుడు దారుణ హత్యకు గురవడం చాల బాధాకరమన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. సుబ్బరాయుడు కొడుకు ఎన్నికలలో ఏజెంటుగా కుర్చునందుకే సుబ్బరాయుడిని హత్య చేశారన్నారు. సుబ్బరాయుడిని గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, మరికొందరు హత్య చేశారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే తమ పార్టీ వాళ్ళు కూడా తిరగబడతారన్నారు. ఇక్కడ జరిగే సంఘటనలకు స్థానిక ఎమ్మెల్యే, లోకేష్, సీఎం సమాధానం చెప్పాలన్నారు. శ్రీనివాస రెడ్డి గ్రామంలో ఎన్నో హత్యలు చేశారని.. నారపు రెడ్డి, పెద్దిరెడ్డి మరికొంత మందిని హత్యచేయాలని కుట్ర జరుగుతోందన్నారు.

ఆడవాళ్ళను కూడా..

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ ను ప్రోత్సహించడం దుర్మార్గమైన చర్య అన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి. తాము అధికారంలో ఉన్నపుడు ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదన్నారు. టీడీపీ నాయకులు పోలీసులను కూడా బెదిరిస్తూ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ రోజు ఆడవాళ్ళను కూడా జుట్లు పట్టుకొని ఈడ్చి కొడ్తున్నారన్నారు. టీడీపీ నాయకులు గ్రామాలలో హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ ను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసేలా టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు కూడా ఓపిక నశిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

#jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe