High Speed Router : మనింట్లో ఒక డివైజ్ నుంచి ఒక డివైజ్ కి ఒక్క సినిమాని ట్రాన్స్ ఫర్ చేయాలంటే కనీసం రెండు నిమిషాలన్నా(హై స్పీడ్ లో) పడుతుంది. మరి ఓ వెయ్యి సినిమాలని నాలుగు సెకన్లలో ట్రాన్స్ ఫర్ చేయగలిగితే ఎలా ఉంటుంది? ఇంకా టెక్నీకల్ భాషలో చెప్పాలంటే.. ఒక జీబీ డేటాను ట్రాన్స్ ఫర్(1GB Data Transfer) చేయాలంటే కనీసం 2 నిమిషాలు పడుతుంది. అలాంటిది 1000 జీబీ డేటాను నాలుగు సెకన్లలోనే ట్రాన్స్ ఫర్ చేయగలిగితే.. అలాంటి రూటర్ రెడీ అయితే.. భలే ఉంటుంది అనిపిస్తోంది కదూ. అదిగో ఆ భలే అద్భుతాన్ని మన దేశంలో సిద్ధం చేసేశారు. అవును.. భారత్‌లో అత్యంత వేగవంతమైన రూటర్‌ను(High Speed Router) విడుదల చేశారు. నివెట్టి సిస్టమ్స్ తయారు చేసిన అత్యంత వేగవంతమైన రూటర్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులో ప్రారంభించారు. ఇది దేశీయంగా రూపొందించిన IP/MPLS రూటర్. దీని వేగం సెకనుకు 2.4 టెరాబైట్లు(Tbps). అంటే ఈ రూటర్ సహాయంతో ఒక్క సెకనులో 2.4 టీబీపీఎస్ వేగంతో డేటాను బదిలీ చేయవచ్చు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ దేశంలోనే తొలి స్వదేశీ రూటర్(High Speed Router) 2.4 టీబీపీఎస్ వేగంతో పనిచేయడం చిన్న విషయమేమీ కాదన్నారు. నిజానికి ఇది మన దేశానికి ఒక ముఖ్యమైన విజయం అని ఆయన చెప్పారు. ఇది ప్రధాని మోదీ స్వదేశీ విజన్‌ని ప్రోత్సహిస్తుందని కూడా వైష్ణవ్ వెల్లడించారు.
సర్వీస్ సెక్టార్ కు భారత్ బెస్ట్..
భారతదేశం ఇప్పటివరకు సేవా పరిశ్రమకు అద్భుతమైన గమ్యస్థానంగా ఉందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. దీనితో పాటు, ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ సప్లై చైన్స్ స్థానికీకరణ కోసం భారతదేశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన స్థానంలో ఉందన్నారు. ఈ రూటర్(High Speed Router) గురించి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ భారతదేశంలో తయారైన నివెట్టి సిస్టమ్ IP/MPLS (మల్టీప్రొటోకాల్ లేబుల్ స్విచింగ్) రూటర్ త్వరలో దేశంలోని వేలాది ప్రదేశాలలో ఉపయోగిస్తారని చెప్పారు. అలాగే, భారత్ నుంచి ఎగుమతి చేయబోయే ప్రధాన ఉత్పత్తులలో ఇది చేర్చడం జరుగుతుందని భావిస్తున్నారు.
Also Read : రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..!
స్వదేశీ రూటర్ ప్రధాని మోదీ డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తుంది
సాఫ్ట్‌వేర్ - మేధోపరమైన సామర్థ్యాల అభివృద్ధితో మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ వస్తుందని అశ్విని వైష్ణవ్ అన్నారు. భారతదేశం సాఫ్ట్‌వేర్, డిజైన్ సామర్థ్యాలతో బలమైన నెట్ వర్క్ తో ఉంది, ఇది ప్రపంచంలోని ప్రముఖ వినూత్న దేశంగా మారడానికి ఖచ్చితంగా మనకు సహాయపడుతుంది అని మంత్రి పేర్కొన్నారు. భారతదేశంలో తయారు చేసిన ఈ స్వదేశీ రూటర్(High Speed Router) ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) డిజిటల్ ఇండియా(Digital India) విధానాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ఈ విజన్ దేశంలో తయారీ ఆవిష్కరణలకు కొత్త దిశను అందిస్తుంది. ఈ స్వదేశీ రూటర్ భారతదేశ స్వదేశీ ప్రణాళికలో కొత్త అధ్యాయం. అంటూ మంత్రి అశ్వినీ వైష్ణవ పేర్కొన్నారు.