Vyooham: వ్యూహం సినిమాపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

వ్యూహం సినిమాపై వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు.. రేపు సినిమాపై ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది. ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే, తెలంగాణలో అయినా విడుదలకు అనుమతి ఇవ్వాలని RGV అడ్వకేట్ కోరగా అభ్యంతరం వ్యక్తం చేశారు లోకేష్ తరుఫు న్యాయవాది.

RGV's Vyuham: మరోసారి వ్యూహం సినిమా వాయిదా
New Update

Vyooham: వ్యూహం సినిమాపై వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు.. రేపు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది. ఒకవేళ ఏపీలో ఎన్నికల పై ప్రభావం ఉంటుందనుకుంటే, తెలంగాణలో అయినా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు RGV అడ్వకేట్. తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవ్ కాబట్టి ఇక్కడ సినిమా రిలీజ్ కు అనుమతి ఇవ్వాలని వాదనలు వినిపించారు. అయితే, RGV అడ్వకేట్ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు నారా లోకేష్ తరుఫున న్యాయవాది.

publive-image

సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలి..

వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాపై టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని ఆయన కోరారు. రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారని ఆరోపించారు.

Also Read: భర్త చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న నయన్.. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ

publive-image

ట్రైలర్ మాదిరిగానే సినిమా..

ఆర్జీవీ తన ఇష్టాఇష్టాలతో పాత్రలను నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. వ్యూహం సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును తప్పుగా చూపించారని, ట్రైలర్ మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం ఉందని అన్నారు.చంద్రబాబును అప్రతిష్ట పాలు చేసేందుకే సినిమా తీశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యూహం సినిమాతో జగన్‌కు లబ్ధి కలిగేలా ఆర్జీవీ చేస్తున్నారని ఆరోపించారు. వాక్ స్వాతంత్రం పేరిట ఇష్టారీతిన సినిమా తీశారన్నారన్నారు.

Nara Lokesh

జగన్ లబ్ధి కోసమే..

దర్శక, నిర్మాతల చర్యలతో చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని, వ్యూహం సినిమాతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు. ఇప్పటికే దర్శక నిర్మాతలు పలు తప్పుడు చిత్రాలు విడుదల చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు లోకేష్. తీసిన సినిమాలకు లాభాలు రాకపోయినా మళ్లీ సినిమా తీస్తున్నారని ఆరోపించారు. నష్టాలు వస్తాయని తెలిసినా జగన్ లబ్ధి కోసమే చిత్రం తీశారన్నారు. ఏపీ సీఎం జగన్ వెనుక ఉండి వ్యహం సినిమా తీయించారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

#lokesh #rgv-vyuham-movie #vyooham-cinema
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe