మాచర్ల వెళ్లొద్దు.. వారితో మాట్లాడొద్దు: పిన్నెల్లికి హైకోర్టు కండిషన్లు

జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. అప్పటి వరకు మాచర్లకు వెళ్లొద్దని ఆయనపై ఆంక్షలు విధించింది న్యాయస్థానం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశాల్లో పేర్కొంది.

New Update
మాచర్ల వెళ్లొద్దు.. వారితో మాట్లాడొద్దు: పిన్నెల్లికి హైకోర్టు కండిషన్లు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కదలికల‌పై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. మాచర్లకు వెళ్లవద్దని కండిషన్ పెట్టింది. అయితే.. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో వచ్చే నెల అరు వరకు ఉండాలని ఆదేశించింది. కౌంటింగ్ కేంద్రానికి‌ వెళ్లేందుకు ఆరోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ కేసు‌ విషయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశాల్లో పేర్కొంది. ఇంకా సాక్షులతో కూడా మాట్లాడేందుకు వీలులేదని ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు.

పిన్నెల్లి కదలికలపై నిఘా..
పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయి నిఘా విధించాలని సీఈఓ, పోలీసు అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా అజ్ఞాతం వీడలేదు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చినా ఆయన బయటకు రాకపోవడంపై అనుచరుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. పిన్నెల్లి కదలికల‌పై నిఘా పెట్టారు. ఆయన ఎక్కడ ఉన్నారనే అంశంపై ప్రత్యేక బృందాలు ఆరా తీస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు