New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/kadapa-counting-.jpg)
రేపు కౌంటింగ్ నేపథ్యంలో కడప జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపటి ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ వ్యక్తం అవుతోంది. గతంలో చెలరేగిన హింస నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. కౌంటింగ్ కోసం మూడు అంచల భద్రత ఏర్పాటు చేశారు. గొడవలకు అవకాశం ఉన్న చోట భారీగా బలగాలను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ విధించారు. కడప టౌన్ లో 6 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతీ కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు.
తాజా కథనాలు
Follow Us