Gudlavalleru : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో అర్థరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్ బాలికల బాత్రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. By Bhavana 30 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Hidden Camera's In Gudlavalleru Engineering College : కృష్ణాజిల్లా (Krishna District) లోని గుడ్లవల్లేరు (Gudlavalleru) లోని ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం రేగింది. కాలేజీలో గురువారం అర్థరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్‌రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగింది. వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి పై సహచర విద్యార్థులు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీ హాస్టల్ కు చేరుకున్నారు. విద్యార్థులను పోలీసులు అదుపుచేశారు. ఆ తరువాత ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ని ప్రశ్నించారు. అతని వద్ద నుంచి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కెమెరాని ఏర్పాటు చేయడంలో విజయ్ కి మరో విద్యార్థిని సహకరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టళ్ల (Girls Hostel) లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టారు. ఈ ఘటన వారం క్రితమే వెలుగులోకి వచ్చినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు. Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్! #gudlavalleru #engineering-college #hiden-cameras మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి