Hi Nanna Movie Leak: హీరో నానికి బిగ్ షాక్.. హాయ్ నాన్న మూవీ HDక్వాలిటీ వీడియో ఆన్‌లైన్ లో లీక్ 

హీరో నాని నటించిన హాయ్..నాన్న డిసెంబర్ 7న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ సినిమా విడుదలైన మొదటి రోజే హెచ్‌డీ క్వాలిటీలో ఆన్‌లైన్ లో లీకైంది. చాలా వెబ్ సైట్స్ ఈ సినిమా పైరసీ వీడియోను డౌన్ లోడ్ చేసుకునే విధంగా షేర్ చేశాయి. 

New Update
Hi Nanna Movie Leak: హీరో నానికి బిగ్ షాక్.. హాయ్ నాన్న మూవీ HDక్వాలిటీ వీడియో ఆన్‌లైన్ లో లీక్ 

Hi Nanna Movie Leak: ఇంటర్నెట్ స్పీడ్ పెరిగిపోయింది. ఇది ఎంత మంచి చేస్తోందో.. అన్ని అనర్ధాలు తీసుకువస్తోంది. ఏదైనా సెకన్ల వ్యవధిలో ప్రపంచం ముందుకు వచ్చేస్తోంది. ఇక కొత్త సినిమాలు పైరసీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే గంటల వ్యవధిలోనే సినిమాలు నెట్లో దర్శనం ఇవ్వడం తరచూ జరుగుతోంది. ఎన్నోసార్లు ఇలా జరిగింది. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి టెక్నాలజీ దెబ్బకు దొరికిపోతున్నాయి సినిమాలు. తాజాగా నేచురల్ స్టార్ నాని (Hero Nani) నటించిన హాయ్..నాన్న సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా నిన్న అంటే డిసెంబర్ 7న రిలీజ్ అయిన మొదటి రోజే ఆన్‌లైన్ లో లీకైంది. అది కూడా హెచ్‌డీ క్వాలిటీలో. దీంతో సినిమా యూనిట్ షాక్ అయింది. సినిమా లీక్ అవడం విషయంలో యూనిట్ ఆందోళనలో ఉన్నారు. మొదటి రోజే ఇలా హెచ్‌డీ క్వాలిటీలో సినిమా లీక్ అయిపోతే, తమ పరిస్థితి ఏమిటి అని వారు బాధపడుతున్నారు. 

Also Read: ఎమోషనల్ లవ్ డ్రామా ‘హాయ్.. నాన్న’ సినిమా ఎలా ఉంది అంటే.. 

నాని ఒక ప్రేమికుడిగా.. తండ్రిగా.. ప్రేమను పంచి ఇచ్చేవాడిగా.. ప్రేమకోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తిగా ఇలా అన్ని షేడ్స్ లోనూ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. ఇక హీరోయిన్ గా మృణాళ్ (Mrunal Thakur) కూడా నానితో పోటీపడి నటించింది. ఒకే పాత్రలో రెండురకాల షేడ్స్ చూపించడంలో మృణాళ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక సినిమా స్టోరీకి ముఖ్యమైన చిన్నారి పాత్రలో బేబీ కియారా నటనకి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హాయ్.. నాన్న.. నాని కెరీర్ లో మరో మంచి సినిమాగా నిలుస్తుందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో ఇలా సినిమా (Hi Nanna movie) లీక్ అవడం మేకర్స్ కి తీవ్రమైన తలనొప్పి తెచ్చిపెట్టింది. సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది అనే ఆనందం వారికి లేకుండా పోయింది.  చాలా వెబ్ సైట్ లు హాయ్.. నాన్న హెచ్‌డీ క్వాలిటీలో డౌన్ లోడ్ చేసుకునే విధంగా నెట్ లో పెట్టేశాయి. దీంతో పైరసీ దెబ్బ హాయ్.. నాన్నకు గట్టిగానే తగిలింది అని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇలా పైరసీ బారిన పడ్డాయి. వాటిమీద చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా పైరసీ ఆగడం లేదు. ఇది టాలీవుడ్ కు తలనొప్పి తెచ్చిపెట్టే వ్యవహారంగానే ఉంది. ఇప్పుడు నాని సినిమా పైరసీ బారిన పడటం బాధాకరం అని టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా అంటున్నారు. 

Watch this interesting video:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు