Samyuktha: మలయాళం నటి మెద్దుగుమ్మ సంయుక్త. టాలీవుడ్ లో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హీరో రానా దగ్గుబాటి భార్యగా నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తరువాత వరసగా బింబిసార, విరూపాక్ష, సర్ సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే, ఇందులో చాలా సినిమాలు పీరియడ్ డ్రామాలు అవటం విశేషం. అలాగే ఈ సినిమాలతో సంయుక్త మంచి ప్రతిభ గల నటిగా పేరు తెచ్చుకోంది.
తాజాగా విడుదలైన 'డెవిల్' సినిమాలో కూడా సంయుక్త హీరోయిన్ గా నటించింది. హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించారు. అయితే, ఇది కూడా పీరియడ్ డ్రామా కథ. అయితే, ఇప్పుడు సంయుక్త గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
అదేమిటి అంటే.. సంయుక్త త్వరలో వివాహం చేసుకోబోతోందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నిజంగా సంయుక్త పెళ్లి త్వరలో చేసుకోబోతోందో ఏమో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం ఫుల్ సక్సెస్ గా హీరోయిన్ అప్పుడే పెళ్లా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆమె బాయ్ ఫ్రెండ్ ను త్వరలో పెళ్లి చేసుకుంటుంది అంటున్నారు కానీ, అతడు ఎవరూ, ఎక్కడ పని చేస్తారు అనే వివరాలు మాత్రం తెలియడం లేదు. కానీ, రిలేషన్ షిప్ లో ఉందని.. ఈ సంవత్సరం వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుందని మాత్రం వార్త వైరల్ అవుతోంది.
Also Read: కొద్దిలో మిస్ అయ్యా.. జపాన్ భూకంపం పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్