Neha Shetty: హీరోయిన్ నేహా శెట్టి క్రేజీ పిక్స్ వైరల్

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహా శెట్టి బర్త్ డే ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘డీజే టిల్లు’ సినిమాతో టాలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలతో ఇండస్ట్రీలో దూసుకెళుతోంది.

New Update
Neha Shetty: హీరోయిన్ నేహా శెట్టి క్రేజీ పిక్స్ వైరల్

Neha Shetty: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహా శెట్టి నేడు తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ‘డీజే టిల్లు’ సినిమాతో టాలీవుడ్‌లో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అందంతో పాటు తన నటనతో ఫ్యాన్స్ ను మెప్పించింది. ఈ సినిమాలో రాధికగా నేహా శెట్టి అభినయం ఆడియెన్స్‌ను ఎంతో ఆకట్టుకుంది.

publive-image

‘డీజే టిల్లు’ తర్వాత సినిమాలు ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ వరుస అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళుతోంది.‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) సినిమాలో సమ్మోహనుడా (Sammohanuda) సాంగ్ ఛాట్ బస్టర్ అయ్యింది.

publive-image

ఈ పాట నేహా శెట్టి‌లోని డ్యాన్సింగ్ టాలెంట్‌ని చూపించింది. ఇప్పటికీ ఈ పాట హాట్ హాట్‌గా వైరల్ అవుతూనే ఉంది. టాలీవుడ్‌లో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో నేహా శెట్టి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్‌గా మారింది.

publive-image

అందుకే గ్లామర్ ఫ్లస్ పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న హీరోయిన్ కావాలనుకునే హీరోస్, డైరెక్టర్స్ నేహా శెట్టినే ప్రిఫర్ చేస్తున్నారు. హీరో విశ్వక్ సేన్‌తో కలిసి నేహా శెట్టి నటిస్తోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

publive-image

ఈ సినిమాలోని ‘సుట్టంలా సూసి పోకలా..’ పాట లిరికల్ సాంగ్ ట్రెండ్ సెట్ చేస్తోన్న విషయం తెలియంది కాదు. ఇలా ఆడియెన్స్ నుంచి దక్కుతున్న ఆదరణ, టాలీవుడ్ తనపై పెట్టుకున్న నమ్మకంతో క్రేజీ లైనప్ చేసుకుంటోంది నేహా శెట్టి.

Also read: శ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే!

Advertisment
తాజా కథనాలు