సెంట్రల్ సెన్సార్ బోర్డుపై ప్రముఖ తమిళ హీరో విశాల్ (Hero Vishal) సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద నుంచి సెన్సార్ బోర్డు సభ్యులు రూ.6.50 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు చెప్పారు. డబ్బులు పంపిన అకౌంట్ వివరాలను ఆయన ట్విట్టర్ ద్వారా బయటపెట్టడం సంచలనం సృష్టించింది. మొత్తం రెండు బ్యాంక్ ఖాతాలను ఈ డబ్బులను బదిలీ చేసినట్లు వివరించారు విశాల్.
ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం షిండే, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డుపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు విశాల్. తన కెరీర్‌లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై సెన్సార్ బోర్డు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిరంగా మారింది. ఇంకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం కూడా ఉత్కంఠగా మారింది.
ఇది కూడా చదవండి:
RGV: ఈ వీడియోను కచ్చితంగా జనసేన అధినేత చూడాల్సిందే: ఆర్జీవీ ట్వీట్