/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-23T194009.652-jpg.webp)
Eagle Ott Release: దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ ఫిమేల్ లీడ్స్ గా ప్రధాన పాత్రలో కనిపించారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ సినిమాలో రవితేజ యాక్షన్ సీన్స్, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్
ఈగల్ ఓటీటీ రిలీజ్
తాజాగా ఈ సినిమా ఓటీటీ వివరాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చింది. ఈగల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ బారి మొత్తానికి దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. మార్చి రెండు లేదా మూడవ వారం నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్ డేట్ వెలువడే అవకాశం ఉంది.
ఈగల్ స్టోరీ
జర్నలిస్ట్ నళిని( అనుపమ పరమేశ్వన్) రాసిన కథనంతో ఈ స్టోరీ మొదలవుతుంది. ఈగల్ అనేది ఒక నెట్ వర్క్.. ఈ నెట్ వర్క్ అంతా నడిపేది సహదేవ్ వర్మ ( రవితేజ). నక్సలైట్లు, తీవ్రవాదులు, ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు ఈగల్ నెట్ వర్క్ టార్గెట్స్ . అసలు సహదేవ్ వర్మ ఎవరు.? ఈగల్ నెట్ వర్క్ కు తనకు సంబంధం ఏంటి..? ఈగల్ నెట్ వర్క్ లక్ష్యం ఏంటి..? జర్నలిస్ట్ నళిని పరిశోధనలో ఈ విషయాలు ఎలా బయటకు వచ్చాయి అనేదే ఈ సినిమా కథ.